E-Paper
Advertisement

Bajaj Chetak C25 Discount: చేతక్ లవర్స్ కు గుడ్ న్యూస్, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్!

Bajaj Chetak C25 Discount: చేతక్ లవర్స్ కు గుడ్ న్యూస్, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్!
Advertisement

Bajaj Electric Scooters Discount: బజాజ్ నుంచి వచ్చిన చేతక్ కు భారతీయ మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత మోడల్ కు స్వస్తి పలికి గత కొద్ది సంవత్సరాల క్రితం కొత్త స్టైలిష్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెర్షన్ లోనూ విడుదల చేసింది. చేతక్ షోరూమ్‌లలో బజాజ్ కొత్త చేతక్ C25 అమ్మకాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది.

ఫస్ట్ 10 వేల మందికి మాత్రమే!

ఈ ఆఫర్ కు సంబంధించి బజాజ్ ఓ కండీషన్ పెట్టింది. మొదటి 10,000 మంది కస్టమర్లకు మాత్రమే రూ.4,299 పరిమిత కాల ముందస్తు తగ్గింపును ఆఫర్ ను అందిస్తోంది. రూ.91,399 ఎక్స్ షోరూమ్ ధరకు లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు రూ.87,100కే అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ C25 డెలివరీలు ప్రారంభమయ్యాయి.

ఒక్క ఛార్జ్ తో 113 కి.మీ ప్రయాణం

Advertisement

పట్టణ ప్రయాణానికి అనుకూలంగా తయారు చేసిన చేతక్ C25లో 2.5kWh బ్యాటరీ ఫిక్స్ చేసింది. ఈ బ్యాటరీ ఒక్క పూర్తి ఛార్జ్ తో 113 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ మెటల్ బాడీ, 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. హిల్ హోల్డ్ అసిస్ట్, రెండు రైడ్ మోడ్‌లు, గైడ్ మీ హోమ్ లైటింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

C25 బజాజ్ చేతక్ EV లైనప్‌ ను 30, 35 సిరీస్‌ లతో పాటు విస్తరిస్తుంది. మొదటిసారి EV కొనుగోలుదారులు, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను కోరుకునే వారికి ఈ స్కూటర్ అనుకూలగా ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ కు సంబంధించిన డెలివరీలు కూడా ప్రారంభం అయ్యాయి.

అధికారికంగా 2020లో లాంచ్

Advertisement

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ జనవరి 14, 2020న లాంచ్ అయ్యింది. ఇది సిటీ రైడింగ్ కు, చిన్న వీకెండ్ ప్రయాణాలకు  అనుకూలంగా ఉంటుంది. చేతక్ ధర రూ. 96.40 వేల నుండి ప్రారంభమవుతుంది. అయితే, టాప్ మోడల్ ధర రూ.1.34 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Read Also: ఇకపై ఏసీ ఆన్ చేసి మైలేజ్ టెస్ట్ చేయాల్సిందే.. కేంద్రం కీలక నిర్ణయం!

ఈ స్కూటర్ మొత్తం ఆరు రంగులను కలిగి ఉంటుంది. బ్రూక్లిన్ బ్లాక్, సిట్రస్ రష్, సైబర్ వైట్, హాజెల్‌ నట్, ఇండిగో మెటాలిక్, వెల్లుటో రస్సోతో సహా 6 రంగులలో అందుబాటులో ఉంది. ఇది రైడర్లకు మంచి స్టైలింగ్ ఆప్షన్స్ ను అందిస్తుంది.  ఇది 5 వేరియంట్లలో వస్తుంది. బజాజ్ చేతక్ కీ స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే, దీని బ్యాటరీ రేంజ్ 113 కిలో మీటర్లు. ఎలక్ట్రిక్ వెర్షన్ లో అందుబాటులో ఉంది. ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. తాజాగా తగ్గింపుతో చేతక్ C25 కొనుగోళ్లు పెరుగుతాయని బజాజ్ కంపెనీ భావిస్తోంది.

Read Also: ఎలక్ట్రిక్ వెహికిల్ లో వెళ్తున్నారా? బ్యాటరీ అయిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా?

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×