E-Paper
Advertisement

Electric car charging: హోమ్ ఛార్జింగ్ vs పబ్లిక్ ఛార్జింగ్.. ఎలక్ట్రిక్ కారుకు ఏది చీప్ అండ్ బెస్ట్?

Electric car charging:  హోమ్ ఛార్జింగ్ vs పబ్లిక్ ఛార్జింగ్.. ఎలక్ట్రిక్ కారుకు ఏది చీప్ అండ్ బెస్ట్?
Advertisement

Home Charging vs Public Charging: సాధారణంగా ఎలక్ట్రిక్ కొనుగోలు చేసిన వినియోగదారులు ఎక్కువగా ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటారు. ప్రయాణ సమయంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించుకుంటారు. అయితే,  చాలా మంది EV యజమానులు తరచుగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించడం కంటే ఇంట్లో ఛార్జింగ్ చేయడం మంచిదని భావిస్తుంటారు. ఇంతకీ ఎలక్ట్రిక్ వాహనాలకు హోమ్ ఛార్జింగ్ బెస్టా? పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ బెస్టా? ఏది చౌక? ఏది సేఫ్టీ? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ హోమ్ ఛార్జింగ్

ఎలక్ట్రిక్ కారు యజమానులు సాధారణంగా చాలా మంది ఇంట్లో ఛార్జ్ చేస్తుంటారు. ఎలక్ట్రిక్ కార్లను ప్రామాణిక AC హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేసుకనే వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా గ్యారేజ్, పార్కింగ్ స్థలంలో ఈ ఛార్జింగ్ పాయింట్ ను ఇన్‌ స్టాల్ చేసి, అక్కడి నుంచి కారుకు ఛార్జ్ చేస్తారు. పూట ఛార్జింగ్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తిగా ఛార్జ్ అవుతుంది.  పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ తో పోలిస్తే హోమ్ ఛార్జింగ్ సాధారణంగా చౌకగా ఉంటుంది. నివాస వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. తరచుగా ఛార్జింగ్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే, హోమ్ ఛార్జింగ్ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభంలో కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

⦿ పబ్లిక్ ఛార్జింగ్

Advertisement

సిటీలు, హైవేలు, మాల్స్, ఆఫీస్ కాంప్లెక్స్‌ లలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు సర్వసాధారణంగా అందుబాటులో ఉంటాయి. ఈ స్టేషన్లు తరచుగా వేగవంతమైన DC ఛార్జింగ్‌ను అందిస్తాయి. ఇవి వాహనం, ఛార్జర్ సామర్థ్యాన్ని బట్టి దాదాపు 30 నుంచి 60 నిమిషాల్లో EV బ్యాటరీని 80 శాతం వరకు రీఛార్జ్ చేస్తాయి.  సుదూర ప్రయాణాల సమయంలో, హోమ్ ఛార్జింగ్ అందుబాటులో లేనప్పుడు పబ్లిక్ ఛార్జింగ్ ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా హోమ్ ఛార్జింగ్ తో పోల్చితే కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కొన్ని ప్రాంతాలలో వేచి ఉండే సమయం, ఛార్జింగ్ స్లాట్ల లభ్యత, నెట్‌ వర్క్ కవరేజ్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది.

Read Also:  టాటా మోటార్స్ గుడ్ న్యూస్, ఈవీల్లో ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ అవసరం లేదు!

హోమ్ ఛార్జింగ్ vs పబ్లిక్ ఛార్జింగ్.. వీటిలో ఏది బెస్ట్?  

Advertisement

రెండు ఆప్షన్స్ మంచివే. అయితే, తక్కువ ఖర్చులు, సౌలభ్యం కారణంగా రోజువారీ ఉపయోగం కోసం హోమ్ ఛార్జింగ్ అనుకూలంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, సుదీర్ఘ ప్రయాణాల సమయంలో బ్యాకప్‌ గా పబ్లిక్ ఛార్జింగ్ మంచి ఎంపిక అవుతుంది.  EVల కొనుగోళ్లు పెరుగుతూనే ఉన్నందున, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. సో, వీలైనంత వరకు వాహనానికి ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవడం వల్ల తక్కువ ఖర్చు అవుతుంది. కానీ, సుదూర ప్రయాణాల సమయంలో తప్పనిసరిగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ ఉపయోగించుకోకతప్పదు. అయితే, కాస్త ఖర్చు, వెయిటింగ్ సమయం ఎక్కువ అవుతుంది.

Read Also:  ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది, హ్యాపీగా గాల్లో ఎగిరిపోవచ్చు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×