E-Paper
Advertisement

Electric Air Taxi In India: ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది, హ్యాపీగా గాల్లో ఎగిరిపోవచ్చు!

Electric Air Taxi In India: ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది, హ్యాపీగా గాల్లో ఎగిరిపోవచ్చు!

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ట్రాఫిక్ జామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫీస్ కు వెళ్లే సమయంలో, ఆఫీస్ నుంచి వచ్చే సమయంలో రోడ్ల మీద ప్రయాణీకులు, వాహనదారులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఈ సమస్య నుంచి నగరవాసులను బయటపడేసేందుకు ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి. హ్యాపీగా నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ ట్యాక్సీలు సేవలు అందించబోతున్నాయి. చెన్నైకి చెందిన ఏవియేషన్ స్టార్టప్ ePlane కంపెనీ దేశంలో తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ అయిన e200x అభివృద్ధిని వేగవంతం చేసింది. ఇందుకోసం గ్లోబల్ టెక్నాలజీ లీడర్ NVIDIAతో జతకట్టింది. లేటెస్ట్ సిమ్యులేషన్ టూల్స్ ను హై పర్ఫార్మెన్స్ కలిగిన కంప్యూటింగ్‌ తో కలపడం ద్వారా, దేశంలో అభివృద్ధి చెందుతున్న పట్టణ ఎయిర్ మొబిలిటీ రంగంలో కొత్త ఆవిష్కణకు శ్రీకారం చుట్టబోతోంది.

ఎలక్ట్రిక్ ఏవియేషన్ రంగంలో కీలక మైలురాయి

EPlane,  NVIDIA భాగస్వామ్యం భారత ఎలక్ట్రిక్ ఏవియేషన్ రంగంలో ఓ ప్రధాన మైలురాయిగా మారబోతోంది. అత్యాధునిక AI, డిజిటల్ ట్విన్ టెక్నాలజీని ఉపయోగించి ఎయిర్ ట్యాక్సీలను రూపొందించబోతున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్ ట్విన్ నుంచి పవర్ సేఫర్ డెవలప్‌మెంట్ దిశగా అడుగులు వేయనున్నాయి. ePlane కంపెనీ e200x ఎయిర్ ట్యాక్సీ  వివరణాత్మక డిజిటల్ ట్విన్‌ను రూపొందించడానికి NVIDIA Omniverse సాఫ్ట్‌ వేర్‌ ను ఉపయోగిస్తోంది. ఈ వర్చువల్ మోడల్ కు సంబంధించి సెన్సార్ పనితీరును అంచనా వేయడానికి, అత్యవసర పరిస్థితులను పరీక్షించడానికి ఇంజనీర్లకు అనుమతిస్తుంది. ఇవన్నీ ఫిజికల్ టెస్టింగ్ విమానాలు ప్రారంభమయ్యే ముందు క్లౌడ్ ఆధారితంగా టెస్ట్ చేస్తారు.

హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ ఫ్రా, అధునాతన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను ఉపయోగించి, సిస్టమ్ రియల్ టైమ్  ఏరోడైనమిక్ ఫిజిక్స్ ను అందిస్తుంది. మిలియన్ల కొద్ది వర్చువల్ ఫ్లైట్ కిలోమీటర్లను నిర్వహించడం ద్వారా, కంపెనీ నిర్మాణాత్మక, అల్గారిథమిక్ నిర్ణయాలను డిజిటల్‌గా ధృవీకరించనుంది. ఈ అభివృద్ధి ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుంది.

విమానంలో AI ఇంటిగ్రేషన్

సిమ్యులేషన్‌లకు మించి, ePlane NVIDIA కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నేరుగా e200xలో అనుసంధానించాలని భావిస్తోంది NVIDIA  సేఫ్టీ క్రిటికల్ హార్డ్‌ వేర్ స్టాక్‌ను ఉపయోగించి దాని ఏవియేషన్ సేవలను కొనసాగించాలని ఈ స్టార్టప్ భావిస్తోంది. ఆన్‌బోర్డ్ సిస్టమ్ కెమెరాలు, రాడార్ల నుంచి నిరంతర డేటా స్ట్రీమ్‌ ను ప్రాసెస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ  స్వయంప్రతిపత్తి, రియట్ లైట్ నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. పట్టణ వాతావరణాలలో ప్రయాణీకుల భద్రత,  కార్యాచరణ విశ్వసనీయతకు ఇది చాలా ముఖ్యమైనది.  డిజిటల్ ట్విన్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఇంజిన్‌ గా కూడా పని చేస్తుంది. ఫిజికల్ ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ ద్వారా  వ్యవస్థ నిర్వహణ అవసరాలను అంచనా వేస్తుంది. యాంత్రిక వైఫల్యాలు జరిగే ముందు ఆయా భాగాల క్షీణతను గుర్తించగలదు.  ఈ విధానం భద్రతా ప్రోటోకాల్‌ ను బలోపేతం చేస్తూ ఆవిష్కరణలను వేగవంతం చేయనుంది.

మొత్తంగా NVIDIA అధునాతన కంప్యూటింగ్ సామర్థ్యాలు, ePlane  విమానయాన నైపుణ్యంతో, e200x అభివృద్ధి అనేది  దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ మొబిలిటీ వైపు ఓ సాహసోపేతమైన అడుగుగా చెప్పుకోవచ్చు.  ఈ పరీక్షలు విజయవంతమైతే, పట్టణ ప్రయాణ రంగంలో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

Read Also: యమహా To వెస్పా.. మార్చిలో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×