E-Paper
Advertisement

EV Scooters vs EV Bikes: ఈవీ మార్కెట్ లో సత్తా చాటుతున్న స్కూటర్స్, బైక్స్ ఎందుకు వెనుకబడుతున్నాయి?

EV Scooters vs EV Bikes: ఈవీ మార్కెట్ లో సత్తా చాటుతున్న స్కూటర్స్, బైక్స్ ఎందుకు వెనుకబడుతున్నాయి?
Advertisement

ఇండియన్ ఎలక్ట్రిక్ మార్కెట్ లో టూ వీరల్స్ సత్తా చాటుతున్నాయి. వీటిలో ఈవీ స్కూటర్లు భారీగా అమ్ముడు అవుతున్నాయి. ఈవీ బైక్స్ మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. కారణం ఏంటి? ఎందుకు ఈవీ స్కూటర్లతో ఈవీ బైక్స్ పోటీ పడలేకపోతున్నాయి?

ఈవీ స్కూటర్ల సక్సెస్ కు కారణాలు

⦿ సిటీ ప్రయాణాలకు అనుకూలం: ఎలక్ట్రిక్ స్కూటర్లు లైట్ వెయిట్ తో ఉంటూ, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటున్నాయి. ట్రాఫిక్ లో ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. ఇవి సిటీ యూజర్లకు అనుకూలంగా ఉంటాయి.

Advertisement

⦿ మంచి స్టోరేజ్: చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో సీటు కింద మంచి స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. హెల్మెట్, బ్యాగులు పెట్టుకునే సౌకర్యం డైలీ కమ్యూటర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

⦿ తక్కువ ధర: ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో లభిస్తున్నాయి. రూ. 1.5 లక్షల్లో మంచి ఈవీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద ప్రభుత్వం సబ్సిడీలు కూడా అందిస్తుంది.

Advertisement

⦿ వినియోగదారులు ఎక్కువ: ఎలక్ట్రిక్ స్కూటర్లు విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలకు అనుకూలంగా ఉంటాయి. అందుకే. వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

ఎలక్ట్రిక్ బైక్స్ ఎందుకు వెనుకబడ్డాయి?

⦿ ఎక్కువ ధరలు

ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలు పట్ల వినియోగదారులు మొగ్గు చూపకపోవడానికి ప్రధాన కారణం ఎక్కువ ధరలు. ఈ బైక్స్ ధరలు రూ. 1.5 లక్షలకు పైగా ఉండటంతో ఆసక్తి చూపించడం లేదు.

⦿ పనితీరు

బైక్ కొనుగోలుదారులు స్పీడ్, పవర్, లాంగ్ రేంజ్ ను కోరుకుంటారు. అయితే, ఇప్పటి వరకు వచ్చిన ఈవీ బైక్స్, పెట్రోల్ బైక్స్ తో పోల్చితే అదే స్థాయిలో నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి.

⦿ ఛార్జింగ్ సదుపాయాలు

సాధారణంగా బైక్స్ రైడింగ్ అనేది సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం రహదారుల పక్కన అనుకున్న స్థాయిలో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ లేదు. ఫలితంగా ఛార్జింగ్ అయిపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే, వీటి కొనుగోలుకు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు.

⦿ బ్రాండ్ ఎఫెక్ట్

స్కూటర్ సెగ్మెంట్ కు సంబంధించి పెద్ద కంపెనీలు తమ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుండగా, ఈవీ బైక్స్ లో ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. అందుకే, వీటి కొనుగోలుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు.

మొత్తంగా ఈవీ టూవీలర్స్ మార్కెట్ లో 80 శాతం వరకు స్కూటర్లే ఉన్నాయి. బైక్స్ ఇంకా నిచ్ మార్కెట్ గా ఉన్నాయి. 2026 తర్వాత ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, తక్కువ ధరలో ఈవీ బైక్స్ అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే, సిటీ యూజ్, తక్కువ ధర, కన్వీనియెన్స్ కారణంగా ఈవీ స్కూటర్లు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ధర, పెర్ఫార్మెన్స్, ఛార్జింగ్ సౌకర్యాల సమస్యల కారణంగా ఇంకా సత్తా చాటలేకపోతున్నాయి.

Read Also:  టీవీఎస్ To బజాన్, 2026లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×