Suzuki Access 125R 2026: సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 125 సీసీ స్కూటర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి మైలేజ్, కంఫర్ట్ తో పాటు చక్కటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ స్కూటర్ అప్ డేటెడ్ వెర్షన్ లో అందుబాటులోకి వచ్చింది. మరింత క్రేజీ లుక్ లో అలరిస్తోంది. సుజుకి యాక్సెస్ 125R పేరుతో విడుదలైన ఈ స్కూటర్ స్పెసిఫికేషన్లు, ధరలు సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సుజుకి యాక్సెస్ 125R స్కూటర్ ధర రూ. 79,958 నుంచి రూ. 96,155 వరకు ఉన్నాయి. వేరియంట్ల వారీగా ధర మారుతున్నాయి. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 79,958 కాగా, రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ ధర రూ. 96,155గా ఉంది. మే 2025 లో లాంచ్ అయిన టాప్ స్పెక్ రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ రూ.1,01,900గా ఉంది. కానీ, తాజా GST తగ్గింపులతో ధరలు కాస్త తగ్గాయి. ఆన్ రోడ్ ధరలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ లతో కలిపి మారుతాయి.
125 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, BS6 ఫేజ్ 2B కంప్లయంట్, SOHC, 2-వాల్వ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 8.3 bhp @ 6,500 rpm పవర్ ఉంటుంది. 10.2 Nm @ 5,000 rpm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ CVT ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. మైలేజ్ లీటర్ కు 47 కిలో మీటర్లు ఇస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 90 కిలో మీటర్లు ఉంటుంది. ప్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 5.3 లీటర్లు ఉంటుంది. బ్రేకులు ఫ్రంట్ డ్రమ్, డిస్క్, రియర్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.
సుజుకి యాక్సెస్ 125R LED హెడ్‌ల్యాంప్, LED DRLs, LED టెయిల్ ల్యాంప్, క్రోమ్ మిర్రర్లు, స్పోర్టీ డిజైన్, ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ ఉంటాయి. వైడ్ సీట్, డ్యూయల్ ఫ్రంట్ పాకెక్స్, 24.4 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్, డ్యూయల్ హెల్మెట్ హుక్స్, యుటిలిటీ హుక్స్, ఆల్యూమినియం ఫుట్ రెస్ట్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లో డిజిటల్ LCD స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్లు ఉంటాయి. రైడ్ కనెక్ట్ వేరియంట్లలో బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, TFT స్క్రీన్ విత్ నావిగేషన్ ఉంటుంది. సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ, ఈజీ స్టార్ట్ సిస్టమ్, పాసింగ్ స్విచ్, హజార్డ్ లైట్స్ ఉంటాయి.
కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్, పార్కింగ్ బ్రేక్ లాక్, LED లైటింగ్ ఫర్ బెటర్ విజిబిలిటీ, హజార్డ్ వార్నింగ్ లైట్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. మెటాలిక్ మాట్ బ్లాక్, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మాట్ స్టెల్లర్ బ్లూ, సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బీజ్, పెర్ల్ మాట్ ఆక్వా సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. తాజాగా సుజుకి యాక్సెస్ 125R స్పోర్టీ వేరియంట్ లాంచ్ అయింది. ఇందులో స్పోర్టీ డిజైన్, ఫుల్ డిజిటల్ క్లస్టర్ విత్ బ్లూటూత్, నావిగేషన్, USB C ఛార్జింగ్, రీట్యూన్డ్ సస్పెన్షన్, లైటర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది స్టాండర్డ్ మోడల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. మంచి రైడ్ ఫీల్, ఎకో అసిస్ట్ టెక్‌ను కలిగి ఉంటుంది. ఇది E20 ఫ్యూయల్ కంప్లయంట్, డైలీ కమ్యూటింగ్‌కు అనుగుణంగా ఉంటుంది.
Read Also: జస్ట్ రూ. 5 లక్షల్లో స్టైలిష్ కారు, మతిపోగొట్టేస్తున్న మారుతి ఇగ్నిస్!