E-Paper
Advertisement

Ex-Showroom vs On Road Price: ఎక్స్ షోరూమ్ ధరతో పోల్చితే, ఆన్ రోడ్ ధర ఎక్కువ.. కారణం ఏంటో తెలుసా?

Ex-Showroom vs On Road Price: ఎక్స్ షోరూమ్ ధరతో పోల్చితే, ఆన్ రోడ్ ధర ఎక్కువ.. కారణం ఏంటో తెలుసా?
Advertisement

Ex-Showroom vs On Road Price Comparison: సాధారణంగా కొత్త కారు లేదంటే బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు రకాల ధరలు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎక్స్ షో రూమ్ ధర కాగా, మరొకటి ఆన్ రోడ్ ధర. చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా ఏంటనేది తెలియదు. రెండు ధరలు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? అని ఆలోచిస్తారు. అయితే, ఇప్పుడు మనం రెండు ధరల మధ్య తేడాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఎక్స్ షోరూమ్ ధర అంటే ఏంటి?   

ఎక్స్-షోరూమ్ ధర అనేది వాహనానికి సంబంధించి ప్రాథమిక ధర. ఇందులో తయారీదారు బేస్ ధరతో పాటు GST, డీలర్ మార్జిన్ ఉంటాయి. ఇది షోరూమ్‌ లో ఉన్న వాహనానికి జోడించిన ట్యాగ్ రేట్. ఇందులో ప్రభుత్వ లెవీలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలకు సంబంధించి ఎలాంటి ఫీజులు ఉండవు.

ఆన్-రోడ్ ధర అంటే ఏంటి?

Advertisement

ఆన్ రోడ్ ధర అంటే మీ వాహనాన్ని చట్టబద్ధంగా రోడ్డు మీద నడపడానికి అయ్యే మొత్తం ఖర్చు. ఎక్స్ షోరూమ్ ధరకు అదనంగా ఛార్జీలు యాడ్ చేయబడుతాయి. వీటిలో ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్డు ట్యాక్స్ లు, వెహికిల్ ఇన్సూరెన్స్,  ఫాస్ట్‌ ట్యాగ్ ఫీజు, డీలర్ హ్యాండ్లింగ్ ఛార్జీలు ఉంటాయి. రోడ్ ట్యాక్స్, ఇతర ఛార్జీలు వాహనం కొనుగోలు చేసే రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మొత్తంగా కొనుగోలు చేసిన వాహనం ఇంటికి తీసుకెళ్లేందుకు చెల్లించే అదనపు ఖర్చులను కలుపుకుని ఆన్ రోడ్ ధరగా చెప్తారు. ఇందులో యాక్సెసరీస్, ఎక్స్ టెండెడ్ వారంటీ ఖర్చులు కూడా ఉంటాయి.

ఎక్స్ షోరూమ్ తో పోల్చితే, ఆన్ రోడ్ ధర ఎక్కువ..

సాధారణంగా ఆన్ రోడ్ ధర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఎక్స్ షోరూమ్ ధర మీకు, డీలర్‌కు మధ్య ప్రైమరీ లావాదేవీని మాత్రమే కవర్ చేస్తుంది. వాహనాన్ని చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా మార్చడానికి, కొనుగోలుదారుగా మీకు అనుమతి ఇవ్వడానికి అదనపు ఖర్చులు అవుతాయి. రాష్ట్ర రవాణా అధికారులు రిజిస్ట్రేషన్,  రోడ్ ట్యాక్స్ ను తప్పనిసరి చేస్తారు. దేశంలోని అన్ని వాహనాలకు బీమా తప్పనిసరి. ఎక్స్ షోరూమ్ ధర సరసమైనదిగా కనిపించినప్పటికీ, ఆన్ రోడ్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందంటే?

Advertisement

కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వ్యక్తలు ఎక్స్ షోరూమ్, ఆన్ రోడ్ ధరల మధ్య తేడాను ముందుగానే తెలుసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఖర్చుకు ఇబ్బంది పడే అవకాశం ఉండదు. తయారీదారులు తరచుగా ఎక్స్ షోరూమ్ ధరలు తక్కువగా ఉన్నందున వాటిని ప్రకటిస్తారు. కానీ, ఆన్ రోడ్ కోట్ కోసం ముందుగా అడిగి తెలుసుకోవాలి. ఇది చివరి నిమిషంలో బడ్జెట్ ఇబ్బందులను నివారిస్తుంది. అందుకే, ముందుగానే ఎక్స్ షోరూమ్, ఆన్ రోడ్ ధరల మధ్య తేడా తెలుసుకోవడం మంచిది.

Read Also: ఆటో మేటిక్ కారును మాన్యువల్ కారుగా మార్చుకోవాలా? సింపుల్ గా ఇలా చేస్తే సరి!

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×