E-Paper
Advertisement

Kushaiguda Hit and Run: అర కిలోమీటరు ఈడ్చుకెళ్లి.. కారుతో తొక్కించారు! బాధితుడి సంచలన విషయాలు

Kushaiguda Hit and Run: అర కిలోమీటరు ఈడ్చుకెళ్లి.. కారుతో తొక్కించారు! బాధితుడి సంచలన విషయాలు
Advertisement

Kushaiguda Hit and Run: హైదరాబాద్‌లోని కుషాయిగూడలో చోటుచేసుకున్న ఈ కిరాతక ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అతివేగంతో దూసుకుపోతున్న పోకిరీలను అడ్డుకోబోయిన సతీష్ అనే వ్యక్తిని, నిందితులు మానవత్వం లేకుండా కారుతో ఢీకొట్టి, సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లారు. మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ వద్ద ప్రారంభమైన ఈ వికృత చేష్టలు, చివరకు సతీష్‌ను నిర్దాక్షిణ్యంగా కారు కింద తొక్కించి చంపేంత పని చేశాయి. ఈ నెల 9న జరిగిన ఈ దారుణం తాలూకు సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో అసలు నిందితుల పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణానికి గల కారణాలను పరిశీలిస్తే, రాంపల్లి నీలగిరి హోమ్స్‌కు చెందిన సతీష్(45), వెళ్తుండగా మల్లాపూర్ చౌరస్తా వద్ద వెనుక నుంచి ఒక బొలెరో కారు అతివేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన సతీష్.. రాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆ యువకులు పదిమందికి ముప్పు కలిగిస్తారన్న ఉద్దేశంతో వారిని వెంబడించి అడ్డుకున్నారు. సతీష్ ఆ కారుకు ఎదురుగా నిలబడగా, నిందితులు మరింత వేగంగా కారును ముందుకు పోనిచ్చారు. దీంతో సతీష్ ప్రాణరక్షణ కోసం కారు బానెట్‌ను గట్టిగా పట్టుకున్నా, నిందితులు ఏమాత్రం కనికరం చూపకుండా అలాగే అర కిలోమీటరు ఈడ్చుకెళ్లారు. అదుపుతప్పి సతీష్ కింద పడిపోగానే, అతనిపై నుంచే కారు పోనిచ్చి పరారయ్యే ప్రయత్నం చేశారు.

Advertisement

ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాధితుడు సతీష్ సంచలన విషయాలు వెల్లడించారు. “నేను వారిని అడ్డుకోబోయినప్పుడు వాళ్లు భయపడలేదు. సరే కదా నవ్వుతూ వికృత చేష్టలు చేస్తూ నన్ను ఈడ్చుకెళ్లారు.” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సతీష్ కాలు విరిగిపోవడమే కాకుండా, అతని ప్రైవేట్ పార్ట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. “45 ఏళ్ల వయసులో నా తల్లితో సేవలు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదు.” అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. సతీష్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆ కారును చుట్టుముట్టి అందులో ఉన్న మహేష్ మరియు తరుణ్ అనే ఇద్దరు యువకులకు దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. కుషాయిగూడ పోలీసులు నిందితులపై హత్యాయత్నం మరియు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నారా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నగర వీధుల్లో ఇలాంటి పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Read Also: Hyderabad Traffic Police: హైదరాబాద్‌లో లైసెన్స్ లేని డ్రైవర్లపై పోలీసుల ఉక్కుపాదం.. మార్చి 1 నుండి ప్రత్యేక తనిఖీలు

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×