E-Paper
Advertisement

డ్రింకింగ్ వాటర్ To ఫస్ట్ ఎయిడ్.. ఏంటీ పెట్రోల్ బంక్ లో ఇన్ని ఫ్రీ సర్వీసులు లభిస్తాయా?

డ్రింకింగ్ వాటర్ To ఫస్ట్ ఎయిడ్.. ఏంటీ పెట్రోల్ బంక్ లో ఇన్ని ఫ్రీ సర్వీసులు లభిస్తాయా?
Advertisement

Petrol Pump Free Services: చాలామంది పెట్రోల్ బంక్‌ కు వెళ్తే, ఇంధనం నింపించుకుని వెళ్లిపోతారు. కానీ, అక్కడ ఉచితంగా లభించే సౌకర్యాల గురించి చాలామందికి తెలియదు. నిజానికి, ఈ సేవలు వినియోగదారుల సౌకర్యం కోసం తప్పనిసరిగా అందించాల్సినవే. కానీ, పెద్దగా ఎవరూ పట్టించుకోరు.

⦿ టైర్లలో గాలి నింపడం

పెట్రోల్ బంక్ లో వాహనాల టైర్లలో గాలి నింపడం పూర్తిగా ఉచితం.  ప్రతి పెట్రోల్ బంక్‌ లో ఎలక్ట్రానిక్ ఎయిర్ పంప్ ఉంటుంది. అవసరమైతే అక్కడి సిబ్బంది కూడా సహాయం చేస్తారు. టైర్ ప్రెజర్ సరైన స్థాయిలో ఉంటే వాహనం సురక్షితంగా నడుస్తుంది. ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది.

⦿ తాగు నీరు

Advertisement

తాగునీరు చాలా స్టేషన్లలో ఉచితంగా అందిస్తారు. సాధారణంగా వాటర్ కూలర్, RO సిస్టమ్ ద్వారా శుభ్రమైన నీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ప్రయాణంలో ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

⦿ రెస్ట్ రూమ్

విశ్రాంతి గదులు కూడా ప్రజల కోసం అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా సుదూర ప్రయాణాల్లో ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. చాలా చోట్ల వీటిని శుభ్రంగా నిర్వహించడం కూడా తప్పనిసరి.

⦿ ఫోన్ కాల్ సౌకర్యం

Advertisement

అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ కాల్ చేయాల్సి వచ్చినా, పెట్రోల్ బంక్ సహాయం తీసుకోవచ్చు. అవసరమైతే అక్కడి సిబ్బంది ద్వారా ఉచితంగా కాల్ చేసే సౌకర్యం కల్పించాలి.

⦿ ఫస్ట్ ఎయిడ్

ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా బంక్ లో ఉంటుంది. చిన్న గాయాలు, అనారోగ్య పరిస్థితుల్లో వెంటనే ఉపయోగించుకునేలా అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంటాయి.

⦿ ఫైర్ సేఫ్టీ పరికరాలు

అగ్నిప్రమాదాలు ఎదుర్కొనేందుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా పెట్రోల్ బంక్‌లలో తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ఇవి అత్యవసర సమయంలో వెంటనే ఉపయోగించుకోవచ్చు.

⦿ వర్కింగ్ అవర్స్ వివరాలు

పెట్రోల్ బంక్‌లో పని వేళలు, సెలవు దినాలు వంటి వివరాలను స్పష్టంగా ప్రదర్శించే నోటీసు బోర్డులు ఉండాలి. అలాగే, ఆ స్టేషన్ యజమాని పేరు, సంప్రదింపు వివరాలు కూడా అందుబాటులో ఉంచాలి. ఇది వినియోగదారులకు అవసరమైన సమాచారం అందించడంలో సహాయపడుతుంది.

⦿ బిల్

ఇంధనం నింపుకున్న తర్వాత బిల్ తీసుకోవడం చాలా ముఖ్యం. చెల్లించిన మొత్తానికి బిల్ ఇవ్వాలి. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ బిల్ ఉపయోగపడుతుంది.

⦿ అదనంగా డబ్బులు అడిగితే!

ఒకవేళ ఈ సేవల విషయంలో ఎక్కడైనా సమస్య ఎదురైతే లేదా ఉచిత సేవలకు డబ్బు అడిగితే, వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ పోర్టల్, సంబంధిత పెట్రోల్ కంపెనీ ద్వారా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంటుంది.

Read Also: స్కోడా కార్లపై బంపర్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్!

మొత్తంగా పెట్రోల్ బంక్‌లు కేవలం ఇంధనం నింపే స్థలాలు మాత్రమే కావు. అక్కడ లభించే ఈ ఉచిత సౌకర్యాలు మన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుస్తాయి. ఈ విషయాలను తెలుసుకుని ఉపయోగించుకుంటే ప్రయాణం మరింత ఈజీగా కొనసాగుతుంది.

Read Also: టాటా To హ్యుందాయ్.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ CNG కార్లు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×