E-Paper
Advertisement

Hyderabad: జగిత్యాల బీఆర్ఎస్ సభ.. పిట్ట కథలంటూ కవిత హాట్ కామెంట్స్, ఆర్టీసీ సమ్మెకు మద్దతు

Hyderabad: జగిత్యాల బీఆర్ఎస్ సభ.. పిట్ట కథలంటూ కవిత హాట్ కామెంట్స్, ఆర్టీసీ సమ్మెకు మద్దతు
Advertisement

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు ఓ రేంజ్‌లో హీటెక్కాయి. జగిత్యాల బీఆర్ఎస్ సభపై ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు కల్వకుంట్ల కవిత. జాతీయ పార్టీగా చెప్పకునే బీఆర్ఎస్ కీలక అంశాలు ప్రస్తావన ఎక్కడని లేవనెత్తారు. అధికార పార్టీ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిట్టకథలు చెప్పిందని ఆరోపించారు.

జగిత్యాల బీఆర్ఎస్ సభపై కవిత హాట్ కామెంట్స్

Advertisement

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ సభపై ప్రశ్నలు సంధించారు. తన తండ్రిని టార్గెట్ చేస్తూ పలు అంశాలు ప్రస్తావించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకునే ఆ పార్టీ నేతలు.. కేంద్రాన్ని పల్లెత్తు మాట ఎందుకు అనలేదని ప్రశ్నించారు. ముఖ్యంగా మహిళా బిల్లు, డీలిమిటేషన్ వంటి అంశాలపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడలేదన్నారు.

75 ఏళ్లు వ్యక్తి యువకుడైతే రాష్ట్రంలో యువకులందరూ ఏమవ్వాలన్నారు. తాము పెట్టబోయే పార్టీలో యువతకు మంచి అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే బీఆర్ఎస్‌లో ఆడబిడ్డలకు గౌరవం లేదన్నారు. కనీసం ఆడపిల్లల గురించి భరోసా ఇవ్వలేదన్నారు.

Advertisement

జాతీయ పార్టీకి సమస్యల ప్రస్తావన ఏది.. పిట్ట కథలంటూ కామెంట్స్

ఇప్పటికీ ప్రజలను కేసీఆర్‌ను తప్పుపడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి కనీసం మాటా కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డి.. తెలంగాణ వ్యతిరేకి ఆమె దుయ్యబట్టారు. ప్రజలు అనేక సమస్యల్లో ఉంటే ఓ వైపు ప్రభుత్వం.. మరోవైపు ప్రతిపక్షం సభలు పెట్టడాన్ని తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

పేరు బయట పెట్టకుండా గుంట నక్క ఢిల్లీకి వెళ్లిందని ఆరోపించారు. కాళేశ్వరం వ్యవహారంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ పెద్దలను కలిసిందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ బాటలో బీఆర్ఎస్ నడుస్తోందని, సీజన్ ముగిసిన తర్వాత రైతు భరోసా ఇస్తే ఏం లాభమని ప్రశ్నించారు.

ALSO READ: కెసిఆర్ గారూ.. పార్టీ సంగతి తర్వాత, ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి.. కోమటిరెడ్డి సెటైర్లు

తెలంగాణలో బుధవారం నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు కవిత. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల ఆర్జిజన్లను బెదిరించిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. అయినా సమస్యలను పరిష్కరించే వరకూ వదిలేది లేదని తేల్చేశారు.

ప్రభుత్వం కనీసం జాబ్ క్యాలెండర్‌తోపాటు ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రతిపక్షం లేకుండా పాలన చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. అలా ఎలా చేస్తారో చూస్తామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు.

 

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×