E-Paper
Advertisement

టాటా To హ్యుందాయ్.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ CNG కార్లు ఇవే!

టాటా To హ్యుందాయ్.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ CNG కార్లు ఇవే!
Advertisement

Best CNG Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల లోపు మంచి బూట్ స్పేస్‌తో కూడిన CNG కారు కోసం చూస్తున్నవారికి మార్కెట్ లో మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా CNG కార్లలో పెద్ద సమస్య బూట్ స్పేస్ తగ్గిపోవడం. సింగిల్ సిలిండర్ ట్యాంక్ ఎక్కువ స్థలం ఆక్రమించడం వల్ల ప్రయాణాల్లో లగేజ్ పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది.  అయితే, ఇటీవల వచ్చిన డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. రెండు చిన్న ట్యాంక్‌ లను బూట్ ఫ్లోర్ కింద అమర్చడం వల్ల, లగేజ్ కోసం సరిపడా స్థలం మిగులుతుంది. బడ్జెట్ ధరలో బెస్ట్ CNG కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Tata Tigor iCNG

టాటా టిగోర్ iCNG  రూ. 10 లక్షల్లోపు అందుబాటులో ఉంది. సెడాన్ డిజైన్ కారణంగా ఈ కారులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో ప్రయాణించే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ధర కూడా సుమారు రూ. 7.68 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

⦿ Tata Tiago iCNG

Advertisement

ఇది చిన్న హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, ట్విన్ సిలిండర్ సెటప్ వల్ల బూట్ ఫ్లోర్ సఫరేటుగా ఉండి, అవసరమైన లగేజ్‌ను సులభంగా పెట్టుకోవచ్చు. సిటీలో డ్రైవింగ్‌ కు అనువైన ఈ కారు.  మొదటి కారు కొనాలనుకునేవారికి కూడా మంచి ఆప్షన్.  దీని ధర రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ Tata Punch iCNG

SUV లుక్ కావాలనుకునేవారికి మంచి ఆప్షన్ టాటా పంచ్ Icng. ఈ కారులో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటంతో పాటు, బూట్ స్పేస్ కూడా సరిపడా ఉంటుంది. సిటీ రోడ్లతో పాటు కొంచెం గతుకుల మార్గాల్లో కూడా ఇది సులభంగా నడుస్తుంది. దీని ధర సుమారు రూ. 6.70 లక్షల నుంచి ఉంటుంది.

⦿ Tata Altroz iCNG

Advertisement

ప్రీమియం ఫీల్ కోరుకునేవారికి టాటా ఆల్ట్రోజ్ iCNG బెస్ట్ ఆప్షన్. ఇది మంచి డిజైన్, విస్తృతమైన క్యాబిన్ స్పేస్‌ తో పాటు బూట్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ.7.22 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Read Also: టాటా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ ఈవీపై ఏకంగా రూ. 3.50 లక్షల తగ్గింపు!

⦿ Hyundai Exter Hy-CNG Duo

ఇక టాటా మోడళ్లకు ప్రత్యామ్నాయంగా భావించే వారికి హ్యుండాయ్ ఎక్స్ టర్ Hy-CNG Duo కూడా ఉంది. ఇది ఫీచర్ల పరంగా మంచి ప్యాకేజ్ అందిస్తుంది. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో బూట్ స్పేస్ మెరుగ్గా ఉండటమే కాకుండా, డ్రైవింగ్ కూడా సులభంగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.6.95 లక్షల నుంచి మొదలవుతుంది. కొత్త డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ వల్ల CNG కార్లలో బూట్ స్పేస్ సమస్య చాలా వరకు తగ్గింది.

Read Also: స్కోడా కార్లపై బంపర్ ఆఫర్లు.. ఏకంగా రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×