Skoda Discounts April 2026: కొత్తగా కారు కొనాలని చూస్తున్న వారికి స్కోడా ఆటో మంచి అవకాశాన్ని అందిస్తోంది. తన పాపులర్ మోడల్స్ అయిన స్కోఆ కుషాక్, స్కోడా స్లావియా, స్కోడా కైలాక్, స్కోడా కొడియాక్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఆఫర్లు, ఆయా కార్ల తయారీ సంవత్సరం (MY), వేరియంట్, స్టాక్ లభ్యతపై ఆధారపడి మారుతూ ఉంటాయి. కచ్చితమైన వివరాల కోసం సమీప డీలర్ ను సంప్రదించడం మంచిది.
ఈ నెలలో అత్యధిక బెనిఫిట్స్ స్కోడా కుషాక్ మీద లభిస్తున్నాయి. గత సంవత్సరానికి సంబంధించిన మోడల్స్ యూనిట్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లతో కలిపి మొత్తం రూ. 3 లక్షలకు పైగా బెనిఫిట్స్ అందిస్తోంది. కొత్త యూనిట్లపై తగ్గింపులు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రూ. 1 లక్షకు పైగా తగ్గింపు అందుతోంది. ముఖ్యంగా మిడ్ రేంజ్ వేరియంట్లు ఈ నెలలో మంచి ఆఫర్లను అందిస్తున్నాయి.
ఇక స్కోడా స్లావియాపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. పాత యూనిట్లపై నగదు, కార్పొరేట్, ఎక్స్ఛేంజ్ బోనస్ లతో కలిపి సుమారు రూ. 1.05 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. కొత్త మోడళ్లపై ఈ ప్రయోజనాలు కొంచెం తక్కువగా ఉండి, దాదాపు రూ. 75,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. ఈ సెడాన్‌పై లభిస్తున్న ఆఫర్లు కొనుగోలుదారులకు భారీగా తగ్గింపు అందించనున్నాయి.
కొత్తగా వచ్చిన స్కోడా కైలాక్ పై కూడా తగ్గింపులు ఉన్నాయి. పాత యూనిట్లపై రూ. 75,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో నగదు తగ్గింపు, కార్పొరేట్ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి. తాజా మోడళ్లపై తగ్గింపులు రూ. 35,000 నుంచి రూ. 45,000 వరకు ఉంటాయి. అంటే కొంచెం తక్కువగా ఉన్నా, కొత్త వాహనం కావాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: టాటా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ ఈవీపై ఏకంగా రూ. 3.50 లక్షల తగ్గింపు!
ఫ్లాగ్ షిప్ SUV అయిన స్కోడా కొడియాక్ పై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పాత యూనిట్లపై రూ. 3.5 లక్షల వరకు భారీ తగ్గింపు ఉంది. ఇందులో నగదు తగ్గింపు, కార్పొరేట్ బోనస్, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త మోడళ్లపై సుమారు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ నెలలో పాత స్టాక్ క్లియర్ చేయడమే కాకుండా కొత్త మోడళ్ల అమ్మకాలను కూడా పెంచేందుకు ప్రయత్నిస్తోంది స్కోడా కంపెనీ. ముఖ్యంగా పాత మోడల్ యూనిట్లపై ఉన్న భారీ డిస్కౌంట్లు మంచి డీల్ గా కనిపిస్తున్నాయి.
Read Also: కియా సోరెంటో హైబ్రిడ్ టెస్టింగ్ షురూ, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?