E-Paper
Advertisement

కవిత పార్టీ పెద్ద జోక్..రాజకీయ లబ్ది కోసమే, కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కవిత పార్టీ పెద్ద జోక్..రాజకీయ లబ్ది కోసమే, కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడ? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Advertisement

Hyderabad: తెలంగాణలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటి నుంచే పార్టీలు తమ తమ అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యర్థులపై మాటల యుద్దాన్ని తీవ్రతరం చేస్తున్నారు. కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ గురించి అధికార పార్టీ నేతలు ఒకొక్కరుగా స్పందించడం మొదలుపెట్టారు.

కవిత పార్టీపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీపై తనదైన శైలిలో స్పందించారు. ఆమె పార్టీ పెట్టడాన్ని పెద్ద జోక్ గా ఆయన వర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ద్వారా కేటీఆర్, హరీష్ రావు, కవితలకు గుర్తింపు వచ్చిందన్నారు. ఆయన లేకుంటే కవిత ఎక్కడుందన్నారని ప్రశ్నించారు.

కుటుంబంలో ఆధిపత్యం పోరు కాస్త బయటకు వచ్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని స్వయానా కూతురు ఆ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. మొదటి సమావేశంలో ఆమె తప్పు చేశారని కుండబద్దలు కొట్టేశారు.

Advertisement

కవిత పార్టీ పెద్ద జోక్..రాజకీయ లబ్ది కోసమేనని వ్యాఖ్య

తండ్రిని గౌరవించుకోలేని మనిషి, ప్రజలకు తల్లి ఎలా అవుతుందని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. తీవ్ర బాధతో తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఆమెకు తన అన్నపై కోపం ఉండవచ్చని, అధికారం కావాలని ఆశ ఉండవచ్చని, దాని కోసం ఫైట్ చేస్తే తప్పులేదని, తండ్రిని ఆ విధంగా  మాట్లాడడం సరికాదన్నారు.

లిక్కర్ స్కామ్‌లో క్లీన్ చిట్ ఎక్కడ వచ్చిందని, ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉందన్నారు. కేసు నుంచి ఎలా బయటపడాలో చూసుకోవాలన్నారు. ఆ పేరును వాడుకుని కొన్ని సీట్ల విషయంలో మాట్లాడుకుని గెలిచి రాజకీయ లబ్ది కోసమేనని అన్నారు. ఆమె తన సీటు గెలవరని తేల్చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్.

ALSO READ: నాగర్‌కర్నూల్‌లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతన్నలు!

 

Related News

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×