E-Paper
Advertisement

నిరుద్యోగులకు శుభవార్త.. రూ.2 లక్షల జీతంతో ఎన్ఐసీలో ఉద్యోగాలు, చివరి తేది ఇదే

నిరుద్యోగులకు శుభవార్త.. రూ.2 లక్షల జీతంతో ఎన్ఐసీలో ఉద్యోగాలు, చివరి తేది ఇదే
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని  నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో సైంటిఫిక్.. టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 153 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు షార్ట్ నోటిఫికేషన్ జారీ అయింది. టెక్నాలజీ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావించే నిపుణులకు ఇది గొప్ప అవకాశం. ఈ నోటిపికేషన్ కు సంబంధించిన వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొత్తం 153 పోస్టుల్లో సైంటిస్ట్-సి విభాగంలో 12 ఖాళీలు ఉన్నాయి. సైంటిస్ట్-డి విభాగంలో అత్యధికంగా 141 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌లోని వివిధ ప్రాజెక్టులలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 153

విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (B.E/B.Tech) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఎంఎస్సీ (M.Sc), ఎంఈ (M.E), ఎంటెక్ (M.Tech), ఎంఫిల్ (M.Phil) పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఈ పోస్టులకు కేవలం విద్యార్హతలు ఉంటే సరిపోదు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా నిర్ణీత కాలం పాటు వృత్తిపరమైన అనుభవం తప్పనిసరి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పనిలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.

Advertisement

వయస్సు: సైంటిస్ట్-సి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు. సైంటిస్ట్-డి పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

జీతం: వేతనాల విషయానికొస్తే సైంటిస్ట్-సి అభ్యర్థులకు నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు లభిస్తుంది. సైంటిస్ట్-డి అభ్యర్థులకు రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు జీతభత్యాలు అందుతాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపికలో అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ కీలక పాత్ర పోషిస్తాయి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. జనరల్ అభ్యర్థులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులను సమర్పించడానికి 2026 ఏప్రిల్ 30 చివరి తేదీగా నిర్ణయించారు.

ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ రంగ నిపుణులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వ రంగంలో స్థిరపడవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://recruitment.nic.in/

ALSO READ: బీటెక్ అర్హతతో NPCIL‌లో 330 ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం, డోంట్ మిస్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×