E-Paper
Advertisement

ఒక్క నెలలో ఇన్నిఈవీలా.. ఈ నెలలో మార్కెట్‌ ను షేక్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఒక్క నెలలో ఇన్నిఈవీలా.. ఈ నెలలో మార్కెట్‌ ను షేక్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Upcoming Electric Cars June 2026: జూన్ లో భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ లో కీలక మోడళ్లు విడుదల కానున్నాయి. ఈ కొత్త మోడల్స్ ప్రీమియం సెగ్మెంట్‌ తో పాటు మాస్ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతున్నాయి. టెక్నాలజీ, రేంజ్, డిజైన్ పరంగా ఈ కార్లు వినియోగదారుల్లో భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇంతకీ ఆ మోడల్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టాటా సియెర్రా EV

జూన్ రిలీజ్ లైనప్‌ లో టాటా సియెర్రా EV ఫస్ట్ ప్లేస్ లో ఉంది. టాటా మోటార్స్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్ కానుంది. క్లాసిక్ సియెర్రా పేరును తిరిగి తీసుకువచ్చి, దాన్ని పూర్తిగా ఎలక్ట్రిక్ SUVగా మారుస్తున్నారు. ఈ కారు ధర సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో డ్యూయల్ మోటార్ AWD సిస్టమ్ ఉండనుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

⦿ టాటా అవిన్యా

Advertisement

టాటా ఫ్యూచరిస్టిక్ మోడల్ అవిన్యా ప్రీమియం EVని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇది కంపెనీ న్యూ జెనరేషన్ 3 EV ప్లాట్‌ ఫారమ్‌ పై ఆధారపడి తయారవుతోంది. ఈ మోడల్‌ ను భవిష్యత్ టెక్నాలజీకి అనుగుణంగా, అధునాతన ఫీచర్లతో రూపొందిస్తున్నారు. దీని ధర సుమారు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుంది. ముఖ్యంగా హై ఎండ్ కస్టమర్లను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.

⦿ కియా సైరోస్ EV

కియా సైరోస్ EV కూడా జూన్ 2026లో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇది కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌ లోకి వస్తుంది. ఈ మోడల్‌ లో లేటెస్ట్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, లగ్జరీ లాంజ్ తరహా ఇంటీరియర్ డిజైన్ ఉండే అవకాశం ఉంది. దీని రేంజ్ సుమారు 400 నుంచి 450 కిలోమీటర్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ధర సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

⦿ హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఫేస్‌ లిఫ్ట్‌

Advertisement

హ్యుందాయ్ ప్రీమియం ఎలక్ట్రిక్ SUV అయిన ఐయోనిక్ 5 ఫేస్‌ లిఫ్ట్‌ ను ఈ నెలలోనే మార్కెట్ లోకి తీసుకురానుంది.  ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌ లో మంచి గుర్తింపు పొందిన మోడల్‌ కు ఇదో అప్‌ డేటెడ్ వెర్షన్. ఈ ఫేస్‌ లిఫ్ట్‌ లో డిజైన్‌ లో చిన్న మార్పులు, అలాగే టెక్నాలజీ అప్‌గ్రేడ్స్ ఉండే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

⦿ విన్‌ఫాస్ట్ VF3

ఇక బడ్జెట్ సెగ్మెంట్‌ లో విన్‌ఫాస్ట్ VF3 కూడా మార్కెట్ లోకి రానుంది. ఇది చిన్న సైజ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుగా విడుదల కానుంది. సిటీ ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ మోడల్ ధర సుమారు రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. తక్కువ ధరతో EV మార్కెట్‌ లో కొత్త వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ మోడల్ మార్కెట్ లోకి రానుంది.

Read Also: ఫ్లెక్స్ ఫ్యూయల్ vs పెట్రోల్ వాహనాలు.. రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా?

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×