E-Paper
Advertisement

డీజీపీకి చేరిన ఈటల పోస్టర్ల పంచాయితీ..!

డీజీపీకి చేరిన ఈటల పోస్టర్ల పంచాయితీ..!
Advertisement

Eatala Posters: స్వేచ్చ బ్యూరో: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై పోస్టర్లకు, గ్రూప్ తగాదాలకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో అంతర్గత కలహాలు పెట్టాలని ఈటల పై పోస్టర్లు పెట్టారని పేర్కొన్నారు. పోస్టర్లు పెట్టిన వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

జాతీయ నాయకత్వం ఫోకస్..

ఈ అంశంపై ఇప్పటికే డీజీపీ, కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వడ్ల కొనుగోలు జరగడం లేదని, రాష్ట్రంలో ఎంత పంట పడిందనే సమాచారం కేంద్రానికి ఇవ్వలేదని తెలిపారు. రైతుల వద్ద ఉన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తామని చెప్పారని, మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలన్నారు.

Advertisement

Also Read: టాప్ 5 దుమ్మురేపే యాక్షన్ సినిమాలు… ఓటీటీ తగలడిపోవాల్సిందే భయ్యా

ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో..

ప్రభుత్వం నిద్రపోతోంది కాబట్టే.. కొనుగోలు సమస్యలు వచ్చాయని ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ గ్రామాల బాట పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం లారీలు పంపుతోందని రాంచందర్ రావు తెలిపారు. ఇదిలా ఉండగా మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా, బీజకేపీ జాతీయ నాయకులు పాల్గొంటారని స్పష్టంచేశారు.

Advertisement

Also Read: స్పోర్ట్స్ అంటే చెవికోసుకుంటారా ? హాట్ స్టార్ లో ఉన్న ఈ బెస్ట్ స్పోర్ట్స్ బయోపిక్ లు మీకోసమే

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×