E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్ తో 700 కి.మీ దూసుకెళ్లే బెంజ్.. ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?

సింగిల్ ఛార్జ్ తో 700 కి.మీ దూసుకెళ్లే బెంజ్.. ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

700KM Range Mercedes GLC L EV: మెర్సిడెస్ బెంజ్ ఇటీవల కొత్త GLC L EVను లాంచ్ ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోడల్ ను చైనా మార్కెట్ కోసం రూపొందింది. అయితే, ఈ కారు రానున్న రోజుల్లో భారత్ లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది.  ఈ కారు డిజైన్, స్పేస్, పవర్‌ ఫుల్ ఎలక్ట్రిక్ సెటప్ ఆకట్టుకుంటున్నాయి.

సాధారణ మోడల్ కంటే మరింత పొడవుగా..

GLC L EV  స్టాండర్డ్ GLC EVకతో పోల్చితే మరింత పొడవుగా ఉంటుంది. అంటే లాంగ్ వీల్‌ బేస్ ను కలిగి ఉంటుంది. కారు లోపల విశాలమైన సంస్థం ఉంటుంది. ఈ వేరియంట్‌ లో మొత్తం పొడవు సుమారు 4.94 మీటర్లు, వీల్‌బేస్ 3.02 మీటర్లుగా ఉంటుంది. దీని వల్ల రెండో వరుస సీటింగ్‌ లో ఎక్కువ లెగ్‌ రూమ్ ఉంటుంది. ఐదు సీట్లతో పాటు ఆరు సీట్ల ఆప్షన్‌ లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

పవర్ ట్రెయిన్ గురించి..

Advertisement

ఈ SUVలో 89kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. డ్యూయల్ మోటార్ సెటప్‌ తో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ తో వస్తుంది. దీని పవర్ అవుట్‌ పుట్ సుమారు 416bhp కాగా, టార్క్ 800Nm వరకు ఉంటుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే, సుమారు 700 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌ లో మంచి ఫర్మార్మెన్స్ ను కలిగి ఉంటుంది.

భారత్ లో సక్సెస్ అవుతుందా?

మరికొద్ది రోజుల్లో ఈ కారు భారతీయ మార్కెట్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాంగ్ వీల్‌ బేస్ కార్లకు భారత్ లో మంచి డిమాండ్ ఉంది. మెర్సిడెస్ ఇప్పటికే E క్లాస్ LWB మోడల్ ద్వారా ఈ సెగ్మెంట్‌ లో మంచి సక్సెస్ అందుకుంది. GLC L EV కూడా  మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: 34 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ కారు.. ధర కేవలం రూ. 3.69 లక్షలే!

అటు మూడు వరుసలు, పెద్ద SUVల విభాగంలో ప్రస్తుతం పోటీ అంతగా లేదు. కొన్ని బ్రాండ్లు ఉన్నప్పటికీ, మెర్సిడెస్ బ్రాండ్ వ్యాల్యూ, ప్రీమియం ఇమేజ్ ఈ మోడల్ ను ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, మంచి ఫీచర్లు, బ్రాండ్ నమ్మకం కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. ఈ మోడల్ ద్వారా మెర్సిడెస్ భారత మార్కెట్‌ లో సత్తా చాటేందుకు ప్రయత్నించనుంది. భవిష్యత్తులో వచ్చే ఇతర GLC, GLE మోడళ్లకు ఇది ఓ బేస్‌ గా పని చేయవచ్చు.

ప్రస్తుతం చైనా మార్కెట్‌ కు మాత్రమే పరిమితమైన GLC L EV, భవిష్యత్తులో భారత్ లో కూడా ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా మారే అవకాశం ఉంది. డిజైన్, పవర్, స్పేస్ కలిసి ఓ బెస్ట్ ఆప్షన్ గా మార్చనున్నాయి.

Read Also: టాటా To టయోటా.. కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×