E-Paper
Advertisement

Cars Discounts: 20 లక్షల కారు.. జస్ట్ 4 లక్షలకే.. ఎక్కడో తెలుసా?

Cars  Discounts: 20 లక్షల కారు.. జస్ట్ 4 లక్షలకే.. ఎక్కడో తెలుసా?
Advertisement

80 Percent Discount on Cars: రూ. 20 లక్షలు విలువ చేసే కారు.. కేవలం రూ. 4 నుంచి 5 లక్షలకే దొరుకుతుందంటే.. ఎవరు మాత్రం వద్దు అనుకుంటారు?  అవును మీరు విన్నది నిజమే. కొద్ది రోజులు వాడిన కార్లు ఏకంగా 50 నుంచి 80 శాతం తగ్గింపు ధరకు లభిస్తున్నాయి. అదీ ప్రభుత్వమే అధికారికంగా అందిస్తుంది. అంత తక్కువ ధరకు కార్లు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం తెలుసుకోండి.

అంత  తగ్గింపు ఎందుకు అంటే?

సాధారణంగా బ్యాంకులు కార్లకు లోన్లు ఇస్తాయి. వారు తిరిగి చెల్లించని కారణంగా వాటిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని భారీ డిస్కౌంట్లకు అమ్మేస్తారు. ఈ కార్లను లోన్స్ చెల్లించని వారి నుంచి ఎక్కువగా జప్తు చేస్తారు. బ్యాంకులు ఆ వాహనాలను ఉంచుకోవు. తమ డబ్బును రికవరీ చేసుకునేందుకు వాటిని అమ్ముతాయి. తమ  అమౌంట్ వస్తే చాలు అనుకుంటాయి. షోరూమ్ మార్జిన్లు, కమీషన్లతో అవసరం లేకుండా తక్కువ ధరలకు అమ్మేస్తాయి. వేలానికి టైమ్ పీరియడ్ ఉంటుంది. ధరలు మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా ప్రారంభమవుతాయి. సాధారణంగా రూ. 20 లక్షలు ఉండే కార్లు, ఈ సమయంలో కేవలం రూ. 5 లక్షలకే లభిస్తుంది. అటు ట్రాఫిక్ వాయిలేషన్స్ కు పాల్పడిన కార్లను కూడా పోలీసులు సీజ్ చేస్తారు. వాటిని యజమానులు తీసుకెళ్లకపోతే, వాటిని కూడా వేలంలో విక్రయిస్తారు. ఈ కార్లను బ్యాంకు అధికారులతో పాటు ప్రభుత్వశాఖలు, పోలీసులు, ఆర్టీఏ అధికారులు అమ్ముతారు.

కార్ల వేలం గురించి ఎలా తెలుసుకోవాలంటే?

Advertisement

ఈ కార్ల వేలం గురించి తెలుసుకునేందుకు కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. వాటి ద్వారా ఎప్పటికప్పుడు వేలం వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. eAuctionsIndia.com, ForeclosureIndia.com, AutoBSE.com లాంటి వెబ్ సైట్లలో ఈ వివరాలను పొందుపరుస్తారు.

ఈ కార్లను ఎలా కొనాలంటే?

⦿వేలంలో తక్కువ ధరకు కార్లు కొనాలనుకునే వాళ్లు ముందుగా సదరు వేలం నిర్వహించే వెబ్ సైట్లలో పాన్, ఆధార్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన వాహనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

Advertisement

⦿ అనంతరం రిఫండబుల్ అమౌంట్ అంటే, కారు ధరలో 5 నుంచి 10 శాతం ధరను చెల్లించి ఆక్షన్ కోసం బిడ్ వేయాలి.

⦿ ఎవరైతే ఎక్కువ బిడ్ వేస్తారో వరికే ఆ కారు అలాట్ అవుతుంది. బ్యాలెన్స్ చెల్లించి కారు ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Read Also: ఎలక్ట్రిక్ వెహికిల్ లో వెళ్తున్నారా? బ్యాటరీ అయిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా?

వేలంలో కారు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

⦿ వాహనం కండీషన్ ఎలా ఉందో చెక్ చేయాలి.

⦿ మార్కెట్ ధర ఎంత ఉందో తెలుసుకోవాలి.

⦿ రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి.

⦿ అన్ని ఓకే అనుకున్న తర్వాతే కారు కొనుగోలుకు ముందుకు వెళ్లాలి.

Read Also: నిస్సాన్ గ్రావైట్ MPV లాంచ్ డేట్ ఫిక్స్, డిజైన్, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×