E-Paper
Advertisement

Tesla Model Y Car: ఇండియాలోకి అడుగు పెట్టిన ఫస్ట్ టెస్లా కారు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Tesla Model Y Car: ఇండియాలోకి అడుగు పెట్టిన ఫస్ట్ టెస్లా కారు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

Tesla Model Y Car 2025: టెస్లా మోడల్ Y  మన దేశంలో 2025లో లాంచ్ అయింది. ఇది ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ SUV. ఇండియాలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి RWD (రియర్-వీల్ డ్రైవ్) కాగా, మరొకటి Long Range RWD వేరియంట్స్ . ఇవి రెండూ సింగిల్ మోటార్ సెటప్‌తో వస్తాయి. అదే సమయంలో Full Self-Driving (FSD) ఆప్షన్ అందుబాటులో ఉంది.  అక్టోబర్ 2025లో Long Range వేరియంట్‌ను అప్‌గ్రేడ్ చేశారు. బ్యాటరీ కెపాసిటీని 84.2 kWhకు పెంచి, రేంజ్‌ను 661 kmకు పెంచారు. అన్ని వేరియంట్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో వస్తాయి. రియల్-వరల్డ్ రేంజ్ 400-550 km వరకు ఉంటుంది.

మోడల్ Y  వేరియంట్లు, ధరలు

⦿  Model Y RWD (బేస్): దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 59.89 లక్షలు ఉంటుంది. ట్యాక్స్ తో కలిపి రూ. 65.89 లక్షలు ఉంటుంది.

Advertisement

⦿ Model Y Long Range RWD: దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 67.89 లక్షలు ఉంటుంది. ఆన్ రోడ్ కు వచ్చే సరికి 73.89 లక్షలు ఉంటుంది.

బ్యాటరీ, పనితీరు గురించి..   

⦿ Model Y RWD: దీని బ్యాటరీ కెపాసిటీ 63 kWhఉంటుంది. రేంజ్ 500 km ఇస్తుంది. పవర్ 299 hp ఉంటుంది.  యాక్సిలరేషన్ (0-100 km/h) 5.9 సెకన్లు పడుతుంది. టాప్ స్పీడ్ 201 km/h ఉంటుంది. DC ఫాస్ట్ చార్జింగ్‌తో 15 నిమిషాల్లో సుమారు 200-250 km రేంజ్ లభిస్తుంది. హోమ్ చార్జింగ్ (AC) 7-11 kWతో పూర్తి చార్జ్ 8-10 గంటల సమయం పడుతుంది.  సింగిల్ రియర్ మోటార్, డ్రైవ్ మోడ్స్ (స్టాండర్డ్, చిల్), రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది.

Advertisement

⦿ Model Y Long Range RWD: దీని  బ్యాటరీ కెపాసిటీ 84.2 kWh ఉంటుంది. రేంజ్ 661 km ఉంటుంది. పవర్ 340 hp ఉంటుంది. యాక్సిలరేషన్ (0-100 km/h) 5.6 సెకన్లు పడుతుంది. టాప్ స్పీడ్ 201 km/h. DC ఫాస్ట్ చార్జింగ్‌తో 15 నిమిషాల్లో 267 km రేంజ్ లభిస్తుంది. పూర్తి చార్జ్ ACతో 10-12 గంటల సమయం పడుతుంది. మెరుగైన ఎనర్జీ ఎఫిషియెన్సీ, సమాన డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఈ వేరియంట్ లాంగ్ ట్రిప్స్‌ కు అనుగుణంగా ఉంటాయి.

Read Also: మోడల్ 3 TO మోడల్ X.. టెస్లా నుంచి లాంచ్ కాబోయే క్రేజీ కార్లు ఇవే!

మోడల్ Y  సాధారణ ఫీచర్లు  

⦿ సేఫ్టీ: 7 ఎయిర్‌బ్యాగ్స్, 360° కెమెరా, ADAS (ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్) ఉంటుంది.

⦿ ఇంటీరియర్: 15-ఇంచ్ టచ్‌ స్క్రీన్, రియర్ టచ్‌స్క్రీన్, ప్రీమియం ఆడియో ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే లేవు.

⦿ కలర్స్, డిజైన్: 5 సీటర్ SUV, మినిమలిస్ట్ డిజైన్ ఉంటుంది. వైట్, బ్లాక్, రెడ్ కలర్స్ లో ఉన్నాయి.

⦿ వారంటీ: బ్యాటరీకు 8 సంవత్సరాలు ఉంటుంది. 1.6 లక్షలు kmకు 70% కెపాసిటీ గ్యారెంటీ ఉంటుంది.

⦿ టెస్లా ఇండియాలో సూపర్‌ ఛార్జర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. కానీ, ప్రస్తుతం పరిమితంగా ఉంది. ధరలు రాష్ట్రాల వారీగా మారవచ్చు.

Read Also:  కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ 10 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×