E-Paper
Advertisement

Hero Bikes Under 1 lakh: స్ల్పెండర్ ప్లస్ To గ్లామర్.. రూ. 1 లక్ష లోపు బెస్ట్ హీరో బైక్‌లు ఇవే!

Hero Bikes Under 1 lakh: స్ల్పెండర్ ప్లస్ To గ్లామర్.. రూ. 1 లక్ష లోపు బెస్ట్ హీరో బైక్‌లు ఇవే!
Advertisement

Best Hero Bikes Under 1 Lakh 2025: హీరో మోటోకార్ప్ నుంచి  రూజ 1 లక్ష (ఎక్స్-షోరూమ్) లోపు అందుబాటులో ఉన్న బైక్‌లు కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఉన్నాయి. ఇవి మైలేజ్, రిలయబిలిటీ, లో మెయింటెనెన్స్, ఆఫర్డబుల్ ప్రైస్‌ కారణంగా మంచి ఆదరణ దక్కించుకున్నాయి. వాటిలో టాప్ 5 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Hero Splendor Plus / XTEC

ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్ ఇది. సింపుల్ డిజైన్, సూపర్ మైలేజ్. 2025లో BS-VII అప్‌డేట్‌తో వచ్చింది. దీని ధర రూ. 73,902 – రూ.91,952 వరకు ఉంటుంది. మైలేజ్ 70-73 kmpl వస్తుంది. i3S టెక్నాలజీ (ఆటో స్టాప్ స్టార్ట్), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (XTEC), బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్, LED హెడ్‌లైట్ (XTEC), ట్యూబ్‌లెస్ టైర్స్ తో వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ 9.8 లీటర్లు ఉంటుంది. మ్యాట్ బ్లాక్, రెడ్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. డైలీ కమ్యూట్‌కు బెస్ట్.

⦿ Hero HF Deluxe

Advertisement

చీపెస్ట్ హీరో బైక్ ఇది. బడ్జెట్ బైయర్స్‌ కు పర్ఫెక్ట్. 2025లో HF Deluxe Pro వేరియంట్ లాంచ్ అయింది. దీని ధర రూ. 55,992 – రూ.73,550 వరకు ఉంటుంది. మైలేజ్ 70+ kmpl ఉంటుంది. i3S, అనలాగ్ మీటర్, ట్యూబ్‌లెస్ టైర్స్ (Pro), సైడ్ స్టాండ్ ఇండికేటర్, హాలోజన్ హెడ్‌లైట్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ 9.1 లీటర్లు ఉంటుంది. కలర్స్ బ్లాక్, రెడ్, బ్లూలో ఉంటుంది. సూపర్ చీప్, హై మైలేజ్ కలిగి ఉంటుంది. బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి.

⦿ Hero Glamour / XTEC

స్టైలిష్ 125cc బైక్. 2025లో అప్‌డేటెడ్ XTEC వేరియంట్ లాంచ్ అయ్యింది. ధర రూ. 81,063 – రూ. 84,106 (XTEC) ధర ఉంటుంది. మైలేజ్ 60-65 kmpl ఉంటుంది. డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్ (XTEC), USB, LED హెడ్‌లైట్, i3S లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ 10 లీటర్లు ఉంటుంది.  మెటాలిక్ బ్లాక్, రెడ్, బ్లూ కలర్స్ లో వస్తుంది. మంచి పవర్, స్టైల్ ఉంటుంది. మైలేజ్ కొంచెం తక్కువ ఉంటుంది.

⦿ Hero Passion XTEC / Plus

Advertisement

యంగ్ రైడర్స్‌ కు సూటబుల్, మాడర్న్ గ్రాఫిక్స్ తో వస్తుంది. దీని ధర రూ. 78,000 – రూ. 85,000  ఉంటుంది. మైలేజ్  65 kmpl ఉంటుంది. డిజిటల్ మీటర్, i3S, సైడ్ స్టాండ్ ఇండికేటర్, USB లాంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ 10 లీటర్లు ఉంటుంది. బ్లాక్ విత్ రెడ్, గ్రే కలర్స లో లభిస్తుంది.  కంఫర్టబుల్ సీట్, గుడ్ బ్యాలెన్స్ ఉంటుంది.

⦿ Hero Super Splendor XTEC

లాంగ్ రైడ్స్‌కు కంఫర్టబుల్, ఎక్స్‌ ట్రా పవర్ తో ఆకట్టుకుంటుంది. రూ. 81,998 ఉంటుంది. మైలేజ్ 65-68 kmpl లభిస్తుంది.  LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ మీటర్, i3S, బ్లూటూత్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ 12 లీటర్లు ఉంటుంది.  మ్యాట్ గ్రే, బ్లాక్ కలర్స్ లో వస్తుంది.  పవర్‌ఫుల్ ఫీల్, వెయిట్ ఎక్కువగా ఉంటుంది.

Read Also: జస్ట్ రూ. 1.9 లక్షలు.. చీపెస్ట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×