E-Paper
Advertisement

Hero Destini Prime vs Suzuki Access 125: హీరో డెస్టినీ ప్రైమ్ vs సుజుకి యాక్సెస్ 125.. ఏది బెస్ట్ అంటే?

Hero Destini Prime vs Suzuki Access 125: హీరో డెస్టినీ ప్రైమ్ vs సుజుకి యాక్సెస్ 125.. ఏది బెస్ట్ అంటే?
Advertisement

Hero Destini Prime vs Suzuki Access 125 Comparison: ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పాపులర్ స్కూటర్లలో హీరో డెస్టినీ ప్రైమ్, సుజుకి యాక్సెస్ 125 కూడా ఉన్నాయి. ఈ రెండూ మంచి ప్రజాదరణను సంపాదించుకున్నాయి. హీరో డెస్టినీ ప్రైమ్ మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ, మెటల్ బాడీ స్కూటర్ గా అందుబాటులో ఉంది. ఇది సామర్థ్యంపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్ కు సుమారు 50-56 కి.మీ మైలేజ్ ఇస్తుంది. అటు సుజుకి యాక్సెస్ 125 పనితీరు అద్భుతంగా ఉంటుంది. ప్రీమియం లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్ కు సుమారు 45-47 కి.మీ మైలేజ్ ను అందిస్తుంది. డెస్టినీ మంచి వ్యాల్యూను కలిగి ఉంటుంది. అయితే, యాక్సెస్ మంచి బిల్డ్ క్వాలిటీ, ప్రీమియం ఫీచర్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

హీరో డెస్టినీ ప్రైమ్ vs సుజుకి యాక్సెస్ 125 కీ ఫీచర్లు  

⦿ ధర: హీరో డెస్టినీ ప్రైమ్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. దీని ధర రూ. 69,430  నుంచి రూ. 71,632 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే సుజుకి యాక్సెస్ 125 ధర రూ. 77,684 నుంచి రూ. 80,021ను అందుబాటులో ఉంటుంది.

Advertisement

⦿ ఇంజిన్ , పనితీరు: రెండింటిలోనూ 124-125cc ఇంజన్లు ఉన్నాయి. యాక్సెస్ 125 మరింత రిఫైన్ చేసి ఉంటుంది. ఇది వేగవంతమైన, చురుకైన సిటీ రైడింగ్ కు మెరుగ్గా ఉంటుంది.  డెస్టిని ప్రైమ్ మంచి టార్క్‌ తో సౌకర్యవంతమైన, స్థిరమైన రైడ్‌ను అందిస్తుంది.

⦿ మైలేజ్: డెస్టినీ ప్రైమ్ సాధారణంగా యాక్సెస్ 125తో పోల్చితే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. డెస్టినీ ప్రైమ్ సుమారుగా 50–56 కి.మీ ఇస్తుదండగా, యాక్సెస్ 125తో సుమారుగా 45–47 కి.మీ ఇస్తుంది.

Advertisement

⦿ ఫీచర్లు: యాక్సెస్ 125 మంచి బూట్ స్పేస్, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ,  ఆప్షనల్ బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది. డెస్టిని ప్రైమ్ మెటల్ బాడీతో వస్తుంది. కుటుంబ ప్రయాణాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించిన డిజైన్ ఆకట్టుకుంటుంది.

Read Also:  వెస్పా 946 హార్స్ ఎడిషన్ లాంచ్, లుక్ చూస్తే మతిపోతోంది బ్రో!

ఏ బైక్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

ఈ రెండు స్కూటర్లు ఇంచుమించు ఒకే పనితీరును కలిగి ఉంటాయి.  ఒకవేళ ఎక్కు ఇంధన సామర్థ్యం, ​​మెటల్ బాడీ, తక్కువ ధర కలిగిన మన్నికైన ఫ్యామిలీ స్కూటర్ కావాలంటే హీరో డెస్టినీ ప్రైమ్‌ను ఎంచుకోవడం బెస్ట్. అటు రిఫైన్డ్,  మృదువైన ఇంజిన్, మెరుగైన పనితీరు, ఆధునిక స్టైలింగ్, హై బ్రాండ్ ప్రీమియంను ఇష్టపడే వాళ్లు సుజుకి యాక్సెస్ 125 ని ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చుతుందో చెప్పండి!

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన ఈవీలు, జనవరి 2026లో నెంబర్ వన్ ఈ స్కూటరే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×