E-Paper
Advertisement

Hero Karizma XMR 250: సరికొత్త హీరో కరిజ్మా వచ్చేస్తోంది, వారెవ్వా.. ఏ ఫీచర్లు గురూ!

Hero Karizma XMR 250: సరికొత్త హీరో కరిజ్మా వచ్చేస్తోంది, వారెవ్వా.. ఏ ఫీచర్లు గురూ!
Advertisement

Hero Karizma XMR 250 Launch Date: హీరో నుంచి వచ్చిన పాపులర్ మోడల్ లో కరిజ్మా బైక్ ఒకటి. మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బైక్ ఇప్పుడు సరికొత్తగా అందుబాటులోకి రాబోతోంది. కరిజ్మా XMR 250 పేరుతో విడుదల కాబోతోంది. 250cc లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో  సరికొత్త స్పోర్ట్స్ బైక్ గా అందుబాటులోకి రానుంది. 6 స్పీడ్ గేర్‌ బాక్స్, వింగ్‌ లెట్స్, కొత్త TFT స్క్రీన్,  అప్‌ సైడ్ డౌన్ ఫోర్క్‌ లతో మార్చి 2026 నాటికి విడుదల కానుంది.

హీరో కరిజ్మా XMR 250 2026 గురించి..   

⦿ ఇంజిన్, పనితీరు: హీరో కరిజ్మా XMR 250  పవర్ ఫుల్ ఇంజిన్ తో రానుంది. ఇది 250cc, 4 వాల్వ్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 9250 దగ్గర 29.5 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అటు 7250 rpm దగ్గర 25 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

⦿ ఫీచర్లు: కొత్త కరిజ్మా బైక్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూ టూత్ కనెక్టివిటీ, ఆల్ LED లైటింగ్,  ఏరోడైనమిక్ డౌన్‌ఫోర్స్ కోసం స్పోర్టీ వింగ్‌ లెట్స్ ఉంటాయి.  అప్‌ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, స్లిప్పర్ క్లచ్, డ్యూయల్ ఛానల్ ABS లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

⦿ డిజైన్: హీరో కరిజ్మా బైక్ స్పోర్టీ లుక్ ను కలిగి ఉంటుంది.  ఏరోడైనమిక్ వింగ్‌ లెట్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌ లైట్లు, కొత్త TFT డిస్‌ ప్లేతో వస్తుంది. అడ్జెస్ట్ చేసే క్లిప్ ఆన్ హ్యాండిల్‌ బార్లతో స్పోర్టీ, సౌకర్యవంతమైన రైడింగ్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ లాంచ్ తేదీ: కొత్త కరిజ్మా బైక్ మార్చి 2026లో లాంచ్ కానున్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో కంపెనీ క్లారిటీ ఇవ్వనుంది.

⦿ ధర:  హీరో కరిజ్మా XMR 250 ధర సుమారు రూ. 2,00,000 (ఎక్స్ షోరూమ్) ధరతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Read Also: సుజుకి నుంచి దుమ్మురేపే స్పెషల్ ఎడిషన్ బైక్, లాంచింగ్ డేట్ ఫిక్స్!

హీరో కరిజ్మా XMR 250 ఏ బైక్స్ తో పోటీ పడుతుందంటే?  

హీరో కరిజ్మా XMR 250 బైక్ ప్రస్తుం మార్కెట్ లో ఉన్న KTM RC 200, KTM 250 Duke, Suzuki Gixxer SF 250 లాంటి 200-250cc స్పోర్ట్స్ బైక్‌లతో పోటీ పడనుంది.

ఇక ప్రస్తుతం అందుబాటులో కరిజ్మా XMR 210 210cc వెర్షన్ లో ఉంది. రాబోయే కరిజ్మా శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన ఫీచర్లతో సరికొత్త వెర్షన్ లో రానుంది. ఈ బైక్ ముఖ్యంగా వేగవంతమైన ప్రయాణం,  స్పోర్టీ లుక్ కోరుకునే యూత్ కు అనుగుణంగా ఉంటుంది.

Read Also:  యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×