Pawan Kalyan Warns: ఆంధ్రప్రదేశ్ లో నిబంధనలకు విరుద్దంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాదారులు.. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దంటూ హెచ్చరించారు. మద్యం ధరలు నిర్ణయించిన దానికంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. నిబంధనలు తుంగలో తొక్కుతున్న మద్యం దుకాణాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎం.ఆర్.పి (MRP) కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు అందింది. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు ఆయన వద్దకు వచ్చి చేరాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్.. అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్దమని తేల్చి చెప్పారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుందని ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు.
అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం
•మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు
•ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyanరాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 3, 2026
ప్రభుత్వం కళ్లుగప్పి ఇష్టారీతిన మద్యం విక్రయిస్తామంటే కుదరని వైన్ షాప్స్, బార్స్, బెల్టు షాపుల నిర్వాహకులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా సూచించారు. అలా పాటించని వారిపై సంబంధిత శాఖ అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలను దిశానిర్దేశం చేశారు. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఈ సందర్భంగా పవన్ సూచించారు. ఇక మీదట ఈ తరహా ఫిర్యాదులు రాకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మద్యం సాధారణ ధర కంటే ఎక్కువగా విక్రయిస్తున్నట్లు కొన్నిరోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీపై రూ.10-50 వరకూ అదనంగా వసూలు చేస్తున్నట్లు మందుబాబులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ హయాంలోనే మద్యం రేట్లు అధికంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున టీడీపీ (TDP), జనసేన (Janasena) నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వంలోనూ ఇలాంటి ఆరోపణలు రావడం.. వైసీపీ (YSRCP)కి ఒక ఆయుధంగా మారుతుందన్న భయం నేతల్లో మెుదలైంది. ఈ నేపథ్యంలోనే పవన్ ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించి.. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలకు ఆదేశించారు.
Also Read: Ambati vs Pawan: అంబటి కోసం జగన్ కాదట.. పవన్ దిగి రావాలట.. ఇదేం దిక్కుమాలిన లాజిక్కో..!