E-Paper
Advertisement

Splendor vs Honda Shine: హీరో స్ప్లెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 DX.. నయా లుక్ లో క్రేజీ బైక్స్!

Splendor vs Honda Shine: హీరో స్ప్లెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 DX..  నయా లుక్ లో క్రేజీ బైక్స్!
Advertisement

Hero Splendor Plus vs Honda Shine 100 DX: హోండా కంపెనీకి సంబంధించి బాగా పాపుల్ అయిన బైక్ షైన్. టూవీలర్ మార్కెట్లో ఈ బైక్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే ప్లాట్ ఫారమ్ నుంచి షైన్ 100 DXను విడుదల చేసింది  హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా. ఈ బైక్ తో అత్యంత డిమాండ్ ఉన్న కమ్యూటర్ విభాగంలో తన సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో భారతీయ మార్కెట్లో బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో స్ప్లెండర్.. సరికొత్త స్ప్లెండర్ ప్లస్ ను అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో మకుటం లేని మహారాజుగా ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చిన మోటార్‌ సైకిల్ మరింత క్రేజీగా ఉంది. వినియోగదారులు రెండు మోటార్‌ సైకిళ్లలో ఏది బెస్ట్ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

హీరో స్ప్లెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 DX  డిజైన్

హీరో స్ప్లెండర్ ప్లస్ పాత రూపాన్నే కలిగి ఉన్నప్పటికీ, మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. బైక్ పెయింట్ స్కీమ్, లివరీని  అప్‌ గ్రేడ్ చేయడం ద్వారా బ్రాండ్ దానిని మెరుగుపరచడానికి ప్రయత్నించింది. స్లిమ్ బాడీతో, బైక్ 3D లోగో,  క్రోమ్‌ లో  స్ప్లెండర్+ బ్యాడ్జ్‌ ను పొందుతుంది. ఈ బైక్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ రెడ్ బ్లాక్, బ్లాక్ రెడ్ పర్పుల్, ఫోర్స్ సిల్వర్, బ్లాక్ హెవీ గ్రే, బ్లూ బ్లాక్ రంగులను కలిగి ఉంది.

Advertisement

అటు హోండా షైన్ 100 DX క్రోమ్ డిజైన్ తో పెద్ద హెడ్‌ ల్యాంప్‌ ను కలిగి ఉంది. ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంది. సింగిల్ పీస్ సీటును కలిగి ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ మందంగా ఉంది. ఇది బైక్ మొత్తం రూపాన్నిమరింత మెరుగుపరిచింది. మొత్తం నాలుగు రంగుల్లో ఆకట్టుకుంటుంది. పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్ రంగుల్లో అందుబాటులో ఉంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 DX ఫీచర్లు

హీరో స్ప్లెండర్ ప్లస్ అనలాగ్ మీటర్‌తో వస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, బ్లూటూత్ కనెక్టివిటీ, SMS అలర్ట్, మైలేజ్ ఇండికేటర్ ని కలిగి ఉంటుంది.

Advertisement

హోండా షైన్ 100 DX డిజైన్‌కు అనుగుణంగా, బైక్‌పై పూర్తిగా డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను అందుబాటులో ఉంచారు. ఈ డిస్‌ ప్లేలో రియల్ టైమ్ మైలేజ్, డిజిటల్ క్లాక్ లాంటి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 DX హార్డ్‌ వేర్

రెండు బైక్‌లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో రెండు మోటార్‌సైకిళ్లకు ముందు, వెనుక రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ట్యూబ్‌ లెస్ టైర్లు ఉన్నాయి. ఒకే తేడా ఏమిటంటే షైన్ 17-అంగుళాల చక్రాలతో వస్తుంది, స్ప్లెండర్ 18-అంగుళాల యూనిట్లను కలిగి ఉంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 DX పవర్‌ట్రెయిన్

హీరో స్ప్లెండర్ ప్లస్ ట్యూబులర్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 8,000 rpm దగ్గర 7.9 hp శక్తిని, 6,000 rpm దగ్గర 8.05 Nm పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేసే 97.2 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ ను కలిగి ఉంది. ఈ పవర్  మల్టీప్లేట్ వెట్ క్లచ్‌ తో కూడిన 4-స్పీడ్ ట్రాన్స్‌ మిషన్ ద్వారా వీల్ కు లింక్ చేయబడి ఉంటుంది.

హోండా షైన్ 100 DX  డైమండ్ టైప్ ఫ్రేమ్‌పై నిర్మించబడిన ఉంటుంది. 98.98 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ తో పవర్ పొందుతుంది. 7,500 rpm దగ్గర 7 hp, 5,000 rpm దగ్గర 8.04 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మల్టీప్లేట్ వెట్ క్లచ్‌ తో యాడ్ చేయబడిన నాలుగు-స్పీడ్ ట్రాన్స్‌ మిషన్‌ తో పనిచేస్తుంది. రైడర్లకు సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్  ఆప్షన్స్ ను అందిస్తుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ vs హోండా షైన్ 100 DX ధర

హీరో స్ప్లెండర్ ప్లస్ ప్రస్తుతం రూ. 83,251 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు అమ్ముడవుతోంది. హోండా షైన్ 100 DX ధరలు భారత మార్కెట్ కోసం ఇంకా ప్రకటించబడలేదు.

Read Also: రెనాల్ట్ న్యూ డస్టర్ To టాటా సియెర్రా EV.. 2026లో రాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×