E-Paper
Advertisement

OTT Movie : ఆంటీ అరాచకం అమ్మాయిలు అంతకుమించి… ఇది అంతుచిక్కని కథ

OTT Movie : ఆంటీ అరాచకం అమ్మాయిలు అంతకుమించి… ఇది అంతుచిక్కని కథ
Advertisement

OTT Movie : షార్ట్ ఫిల్మ్స్ లో సత్తా చాటుకుంటున్నారు చాలా మంది ఔత్సాహికులు. చిన్న పిల్లల దగ్గర్నుంచి, పెద్దల వరకు టాలెంట్ నిరూపించుకోవడానికి ఇది ఒక వేదికగా మారిపోయింది. వీటిలో కొన్నిటికి అవార్డులు కూడా వరిస్తుంటాయి. ఇప్పుడు మనం ఒక లెస్బియన్ స్టోరీ తో వచ్చిన షార్ట్ ఫిలిం గురించి చెప్పుకోబోతున్నాం. ఇది అందరిని ఆలోచింపజేసేలా ఉంటుంది. డైలాగ్స్ ఏమీ ఉండవు. ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్, సైలెంట్ మూమెంట్స్‌తో చెప్పేస్తారు. దీనికి న్యూ యార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు కూడా వచ్చాయి. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2019లో వచ్చిన ఈ ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ పేరు “ది బూత్” (The Booth). రోహిన్ రవీంద్రన్ దీనిని రూపొందించారు. ఇందులో అమృతా సుభాష్, పార్నా పేఠే లీడ్ రోల్స్ లో ఉన్నారు. 15 నిమిషాల ఈ స్టోరీ MUBI, ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఐయండిబిలో 6.6/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పూణేలో ఒక పెద్ద మాల్‌లో రేఖ అనే మహిళ సెక్యూరిటీ గార్డ్ పని చేస్తుంటుంది. ఆమె రోజంతా మహిళల్ని చెక్ చేసే చిన్న రూమ్ లోఉంటుంది. నమస్తే మ్యామ్ అని పలకరిస్తూ, మెటల్ డిటెక్టర్‌తో బాడీ సెర్చ్ చేస్తూ రొటీన్ జీవితం గడుపుతుంటుంది. బయట ప్రపంచం బిజీగా ఉండగా, ఆమె ఒంటరిగా, ఎవరూ గమనించని సీక్రెట్ లైఫ్ లీడ్ చేస్తుంది. మాల్ బ్రైట్ లైట్స్, షాపింగ్ రష్ మధ్య ఆ బూత్ ఆమెకి ఒక ప్రైవేట్ స్పేస్. ఎవరూ లోపలికి రాలేరు, CCTV కూడా ఉండదు.

Read Also : మొదటి అనుభవం కోసం ఆరాటం… ఈ కుర్రాళ్ళు ఇంత కరువులో ఉన్నారేంటి భయ్యా ?

Advertisement

అక్కడే సర్గం అనే యంగ్ గర్ల్ ఎంటర్ అవుతుంది. సర్గం బ్యాంక్ జాబ్ ప్రిపేరేషన్ లో ఉంటుంది. రోజూ మాల్ కి వచ్చి చెకింగ్ పేరుతో బూత్‌లోకి వెళ్తుంది. ఈ ఇద్దరి మధ్య ఒక ఫోర్బిడెన్ లవ్ మొదలవుతుంది. ఆ బూత్ లో ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇద్దరి మధ్య ఎందుకో దూరం పెరుగుతుంది. సర్గంను రేఖ దగ్గరికి రానివ్వదు. దీంతో సర్గం చాలా బాధ పడుతుంది. ఆమె ఎందుకు దూరం పెట్టింది ? వీళ్ళ మధ్య అసలేం జరుగుతోంది ? అనే విషయాలను, ఈ షార్ట్ ఫిలింని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×