E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఇంట్లో ఛార్జింగ్ కోసం ఏమేమి అవసరం?

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఇంట్లో ఛార్జింగ్ కోసం ఏమేమి అవసరం?
Advertisement

EV Charging at Home: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈవీ కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, ఇంటి దగ్గరే సరైన ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. బయటితో పోల్చితే తక్కువ ఖర్చుతో ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, ఇంటి తగ్గర ఛార్జింగ్ సెటప్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఇంట్లో ఈవీ పార్కింగ్ సౌకర్యం ఉండాలి. వాహనం నిలిపే ప్రదేశం దగ్గరే విద్యుత్ కనెక్షన్ ఉండటం చాలా అవసరం. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, చిన్న EV కార్లకు సాధారణ 15A ప్లగ్ పాయింట్ సరిపోతుంది. అయితే, అది సేఫ్ గా ఉండాలి. వాహనం ఇంటికి దూరంగా పార్క్ చేస్తే ఛార్జింగ్ చేయడం కష్టమవుతుంది.

Advertisement

⦿ ఇంట్లో కరెంట్ వైరింగ్ కూడా బాగుండాలి. సరైన ఎర్తింగ్‌ తో కూడిన ప్లగ్ పాయింట్ ఉంటే సురక్షితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. చాలా కంపెనీలు వాహనంతో పాటు పోర్టబుల్ ఛార్జర్‌ ను ఇస్తాయి. పెద్ద బ్యాటరీ కలిగిన ఈవీ కార్లకు ప్రత్యేక AC వాల్ ఛార్జర్ ఏర్పాటు చేస్తే వేగంగా ఛార్జ్ అవుతుంది. అలాగే భద్రత కూడా మెరుగ్గా ఉంటుంది.

⦿ అపార్ట్‌ మెంట్లలో నివసించే వారు ముందుగా హౌసింగ్ సొసైటీ అనుమతి తీసుకోవాలి. మీ మీటర్ నుంచిపార్కింగ్ వరకు వైరింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొందరు ప్రత్యేక సబ్ మీటర్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. దీంతో EV ఛార్జింగ్‌కు ఎంత విద్యుత్ వినియోగమైందో సులభంగా తెలుసుకోవచ్చు.

Advertisement

⦿ మరో ముఖ్యమైన విషయం విద్యుత్ లోడ్ సామర్థ్యం. EV ఛార్జింగ్ వల్ల ఇంటి కనెక్షన్‌ పై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించాలనుకుంటే, స్థానిక విద్యుత్ సంస్థ నుంచి లోడ్ పెంచుకోవాల్సి రావచ్చు.

Read Also: అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ వచ్చేస్తోంది.. ఓలా, ఏథర్ కు ఇక చుక్కలే!

⦿ భద్రత విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎక్స్‌ టెన్షన్ వైర్లు, తాత్కాలిక కనెక్షన్లు ఉపయోగించడం మంచిది కాదు. MCB, RCD లాంటి ప్రొటెక్షన్ పరికరాలు ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే వర్షం, ఎండ నేరుగా పడకుండా ఛార్జింగ్ పాయింట్‌ సేఫ్ ప్లేస్ లో ఉంచడం మంచిది.

⦿ ఖర్చు పరంగా కూడా హోమ్ ఛార్జింగ్ చాలా బెస్ట్. పెట్రోల్, డీజిల్ ఖర్చులతో పోలిస్తే విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. చాలా రాష్ట్రాల్లో యూనిట్‌ కు రూ.6 నుంచి రూ.10 వరకు మాత్రమే ఉంటుంది. ఈవీ రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది.

మన దేశంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు పెరుగుతున్నప్పటికీ ఇంకా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. అందుకే, చాలా మంది హోమ్ ఛార్జింగ్‌పైనే ఆధారపడుతున్నారు. ముందుగానే సరైన ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకుంటే ఈవీ వినియోగం మరింత సులభంగా, ఇబ్బందిలేకుండా ఉంటుంది.

Read Also: చిన్న తప్పులు.. పెద్ద నష్టం.. కారు యజమానులు ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×