E-Paper
Advertisement

Honda Activa vs TVS Jupiter 125: హోండా యాక్టివా 125 vs TVS జూపిటర్ 125..వీటిలో ఏది బెస్ట్ అంటే?

Honda Activa vs TVS Jupiter 125: హోండా యాక్టివా 125 vs TVS జూపిటర్ 125..వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Honda Activa vs TVS Jupiter 125 Comparison: హోండా, టీవీఎస్ కంపెనీలకు చెందిన అద్భుతమైన బైక్ లు, స్కూటర్లు మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా మంచి ఫీచర్లు, అంతకు మించి స్టైల్ తో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సంస్థల నుంచి వచ్చిన బెస్ట్ స్కూటర్లలో హోండా యాక్టివా 125, TVS జూపిటర్ 125 టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాయి. ఈ స్కూటర్లు ఫీచర్లు, మైలేజ్, ధరలో గట్టి పోటీని ఇస్తున్నాయి. TVS జూపిటర్ 125 మెరుగైన బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్లను కూడా అందిపుచ్చుకుంది.  హోండా యాక్టివా 125 విషయానికి వస్తే, మంచి రీసేల్ వాల్యూ, నమ్మకానికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకుంది. జూపిటర్ 125 కొద్దిగా తక్కువ ధరకు, ఎక్కువ మైలేజ్ ఇస్తుండగా, యాక్టివా 125 కాస్త తక్కువ మైలేజ్ ఇస్తుంది.

 హోండా యాక్టివా 125, TVS జూపిటర్ 125 పోలికలు

⦿ హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 ధర విషయానికి వస్తే.. జూపిటర్ 125 కాస్ట్ సుమారు రూ. 75,950 నుంచి ప్రారంభం అవుతుంది. హోండా యాక్టివా 125 ధర సుమారు రూ. 82,257 నుండి మొదలవుతుంది.

Advertisement

⦿ ఇక ఈ రెండు స్కూటర్లు 124, 125 cc ఇంజిన్లతో వస్తాయి. యాక్టివా 8.3 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ 8.04 bhp  పవర్ ను అందిస్తుంది.

⦿ మైలేజ్ విషయానికి వస్తే.. టీవీఎస్ జూపిటర్ 125 లీటరుకు సుమారు 50-52 కిలో మీటర్ల ప్రయాణించే అవకాశం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. హోండా యాక్టివా 125 లీటరుకు సుమారు 47 కిలో మీటర్ల వరకు జర్నీ చెయ్యొచ్చు.

Advertisement

Read Also: ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. చౌకైన ఆటో మేటిక్ కారు ఇదే!

⦿ స్టోరేజ్ ను పరిశీలిస్తే టీవీఎస్ జూపిటర్ 125లో 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. ఇందులో రెండు హెల్మెట్లను పెట్టే అవకాశం ఉంటుంది. యాక్టివాలో బూట్ స్పేస్ కాస్త తక్కువగా ఉంటుంది.

⦿ ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. జూపిటర్ 125లో ఎక్స్‌ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్, బ్లూటూత్ కనెక్టివిటీ సహా పలు లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇక యాక్టివా 125 లో LED హెడ్‌ ల్యాంప్,  సైలెంట్ స్టార్టర్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.    ఉన్నాయి.

Read Also: కవాసకి క్రేజీ ఆఫర్.. ఆ బైక్ మీద ఏకంగా 1.43 లక్షల డిస్కౌంట్!

హోండా యాక్టివా 125, TVS జూపిటర్ 125 లో ఏది బెస్ట్ అంటే?

ఎక్కువ బూట్ స్పేస్, లేటెస్ట్ ఫీచర్లు, మెరుగైన మైలేజ్, తక్కువ ధర కావాలనుకునే వారికి టీవీఎస్ జూపిటర్ 125 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక బ్రాండ్ వాల్యూ, ఎక్కువ కాలం పనితీరు, మంచి రిసేల్ వాల్యూ కావాలనుకునే వారికి హోండా యాక్టివా 125 మంచిది. మీకు ఈ రెండు స్కూటర్లలో దేనిని ఇష్టపడతారు? ఎందుకు? అనేది చెప్పండి.

Read Also: ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్, ధర ఎంతో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×