E-Paper
Advertisement

Kawasaki Ninja 1100SX Offer: కవాసకి క్రేజీ ఆఫర్.. ఆ బైక్ మీద ఏకంగా 1.43 లక్షల డిస్కౌంట్!

Kawasaki Ninja 1100SX Offer: కవాసకి క్రేజీ ఆఫర్.. ఆ బైక్ మీద ఏకంగా 1.43 లక్షల డిస్కౌంట్!
Advertisement

2026 Kawasaki Ninja 1100SX Discount Offer: కవాసకి కొత్త సంవత్సరం ఆఫర్ తీసుకొచ్చింది. నింజా 1100SX పై పరిమిత కాల డిస్కౌంట్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ఈ బైక్ మీద రూ. 1.43 లక్షల డిస్కౌంట్ వోచర్‌ ను అందిస్తోంది. దీనిని బైక్ ఎక్స్ షోరూమ్ ధరతో పోలిస్తే రీడీమ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.  డిస్కౌంట్ తీసివేసిన తర్వాత ఈ బైక్ రూ. 12.99 లక్షలకు అందుబాటులో ఉంది. అయితే, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఖర్చు అదనంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ జనవరి 31, 2026 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

కవాసకి నింజా 1100SX అసలు ధర ఎంత అంటే?

2026 కవాసకి నింజా 1100SX రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసింది. రూ. 14.42 లక్షలకు దీనిని ప్రారంభించింది. ఈ బైక్ 2025లో అందుబాటులోకి వచ్చిన మోడల్ తో సమానంగా ఉంటుంది. అయితే, రంగుల్లో కాస్త తేడాలు ఉన్నాయి.  నింజా 1100SXకి 1,099cc, లిక్విడ్ కూల్డ్, ఇన్‌ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది ఇది 134.14bhp, 113Nm పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ ఇప్పుడు E20 ప్యూయెల్ కు అనుకూలంగా ఉంటుంది. ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో జత చేయబడింది.

Advertisement

నింజా 1100SX పనితీరు, రిలాక్స్డ్ ఎర్గోనామిక్స్, రోజువారీ వినియోగానికి ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే సౌకర్యవంతమైన స్పోర్ట్ టూరర్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి నింజా 1100SX అనేది స్పోర్ట్ టూరింగ్ బైక్ గా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. మంచి పనితీరు, అధునాతన సాంకేతికత, సౌకర్యాన్ని మిళితం చేస్తుంది.  ఇది రోజువారీ ప్రయాణాలకు, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

Read Also:  లో కాస్ట్, బెస్ట్ మైలేజ్.. హీరో HF డీలక్స్ సూపర్ ఆప్షన్ బ్రో!

నింజా 1100SX ఫీచర్లు   

Advertisement

నింజా 1100SX వాల్వ్ సిస్టమ్ DOHC, 16 వాల్వ్స్ తో ఉంటుంది. కంప్రెషన్ రేషియో 11.8:1గా ఉంటుంది. మైలేజ్ సుమారు 17.85 kmpl ఇస్తుంది. ఇండియాలో సుమారు రూ. 14.42 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. స్పోర్ట్ టూరింగ్ బైక్ గా సత్తా చాటుతుంది. ఇది మంచి పనితీరు, శక్తివంతమైన టార్క్, సౌకర్యవంతమైన రైడింగ్‌ను అందిస్తుంది. కొత్త మోడల్స్ E20 ప్యుయెల్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ కొత్త కలర్ స్కీమ్‌లలో లభిస్తున్నాయి. కొన్ని అంతర్జాతీయ మోడల్స్‌ లో హీటెడ్ గ్రిప్స్, క్రూజ్ కంట్రోల్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి ధర లక్షన్నర తగ్గడంతో చాలా మంది యువకులు ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అటు కంపెనీ సిబ్బంది కూడా ఔత్సాహికులు ఈ నెల చివరలోగా ఈ బైక్ ను కొనుగోలు చేయడం మంచిదంటున్నారు. ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్లీ దీని ధర రూ. 14.42 లక్షలకు చేరే అవకాశం ఉందంటున్నారు.

Read Also: ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. చౌకైన ఆటో మేటిక్ కారు ఇదే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×