E-Paper
Advertisement

Suzuki Burgman Street Electric: ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్, ధర ఎంతో తెలుసా?

Suzuki Burgman Street Electric: ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్, ధర ఎంతో తెలుసా?
Advertisement

Suzuki Burgman Street Electric Launch Date: సుజుకి బ్రాండ్ కు చెందిన బర్గ్‌ మాన్ స్ట్రీట్ స్కూటర్ కు ఇండియన్ మార్కెట్ లో మంచి గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా మంచి అమ్మకాలను కలిగి ఉంది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు పెట్రోల్ వెర్షన్ లో అందుబాటులో ఉండగా, త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్ లో అందుబాటులోకి రాబోతోంది. ఈ స్కూటర్ కు సంబంధించిన రేంజ్, ఫీచర్లు, డిజైన్ సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పెట్రోల్ మోడల్ తరహా డిజైన్‌తోనే!

బర్గ్‌ మాన్ స్ట్రీట్ 125 పెట్రోల్ మోడల్ తరహా డిజైన్‌తోనే ఎలక్ట్రిక్ బైక్ కూడా మార్కెట్లోకి రాబోతోంది. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ మీద 120 కిలో మీటర్ల మేర ప్రయాణించనుంది. ఈ బైక్ ఖరీరు రూ. 1,05,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుంది.  బర్గ్‌ మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న OPG మొబిలిటీ ఫాస్ట్ F3, TVS ఆర్బిటర్,  కైనెటిక్ గ్రీన్ ఫ్లెక్స్ తో పోటీ పడే అవకాశం ఉంది. బర్గ్‌ మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్‌ను పోలిన మరో బైక్ హోండా PCX 125 కూడా ఫిబ్రవరి 2026లో ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది.

బర్గ్‌ మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Advertisement

సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ మ్యూల్స్ దాని ICE కౌంటర్‌ పార్ట్‌ కు సమానమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఆప్రాన్ నుంచి మొదలుకొని పొడవైన టెయిల్ సెక్షన్ వరకు ప్రతిదీ అలాగే ఉంటుంది.  సాంప్రదాయ స్కూటర్‌లో అందుబాటులో లేని తెలుపు, నీలం డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ మాత్రం ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది.

ఒకే ఫుల్ ఛార్జ్ తో 120 కిలో మీటర్ల ప్రయాణం

బర్గ్‌ మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ టెక్నికల్ వివరాలు బయటకు రాకపోయినా, ఇది TVS iQube, బజాజ్ చేతక్ కు దగ్గరగా ఉండబోతోంది. 4kW మోటార్‌తో 110cc పెట్రోల్ స్కూటర్‌కు సమానమైన పవర్ ను జెనరేట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్ మీద 80 నుంచి 120 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. టాప్ స్పీడ్ 80 కిలో మీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Read Also: హోండా నుంచి ప్రీమియం సిటీ కమ్యూటర్, లాంచింగ్ ఎప్పుడంటే?

స్మార్ట్‌ ఫోన్‌ తో కనెక్ట్ చేయడానికి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఛార్జింగ్ కోసం స్వాపింగ్ బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉండే అవకాశం ఉంది. పూర్తి LED హెడ్‌ లైట్, TFT స్క్రీన్,   సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ఉంటాయని అంచనా వేస్తున్నారు. సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ వెర్షన్ FAME II సబ్సిడీకి అర్హత కలిగి ఉంటే రూ. లక్ష లోపే అందుబాటులో ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ లాంటి స్కూటర్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

Read Also: ఇది ప్రపంచంలోనే కాస్లీయెస్ట్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×