E-Paper
Advertisement

Honda Cars Feb 2026 offers : హోండా అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 2 లక్షల తగ్గింపు!

Honda Cars Feb 2026 offers : హోండా అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 2 లక్షల తగ్గింపు!
Advertisement

హోండా ఇండియా ఫిబ్రవరి 2026 కోసం అదరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెడాన్, SUV పోర్ట్‌ ఫోలియోలియోకు సంబంధించి భారీగా తగ్గింపు అందిస్తోంది. అధునాతన సిటీ, బోల్డ్ ఎలివేట్, సరికొత్త అమేజ్ కోసం చూస్తున్నట్లు అయితే,  కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్. ఈ ఆఫర్లు ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటాయి. ఇంతకీ హోండా ఏ కార్లపై ఎంత తగ్గింపు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హోండా ఆల్ న్యూ అమేజ్  

ఈ కాంపాక్ట్ సెడాన్ భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఫిబ్రవరిలో హోండా ఆల్ న్యూ అమేజ్ పై రూ.  57,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ. 7,47,790 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది లెవల్ 2 ADAS, స్టాండర్డ్‌ గా 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, క్లాస్ లీడింగ్ 416 లీటర్ బూట్‌తో వస్తుంది. లోపల, క్యాబిన్ 8 అంగుళాల HD టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీని కలిగి ఉన్న టెక్ హెవెన్ తో భద్రత, ఆధునిక లగ్జరీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

⦿ హోండా ఎలివేట్  

Advertisement

SUV పోర్ట్‌ ఫోలియోలో అత్యధిక పొదుపును ఈ కారు పొందుతుంది. రూ. 1,48,000 ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ. 11,59,890 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 1.5L i-VTEC ఇంజిన్‌ ను కలిగి ఉంది. ప్రీమియం 10.25-అంగుళాల టచ్‌ స్క్రీన్, వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్, బలమైన హోండా సెన్సింగ్ ADAS సూట్‌ను కలిగి ఉంది.

⦿ హోండా సిటీ  

5వ జెనరేషన్ హోండా సిటీ భారత్ లో ప్రీమియం సెడాన్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారుపై ఈ నెలలో రూ. 1,27,700 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ కారు ధర రూ. 11,95,300 లక్షలుగా ఉంది. సిటీ లేన్‌వాచ్ కెమెరా, 9 అర్రే ఇన్‌ లైన్ షెల్‌ లతో పూర్తి LED హెడ్‌ల్యాంప్ సెటప్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని విశాలమైన క్యాబిన్,  మంచి వెనుక సీటు సౌకర్యం, భారీ 506 లీటర్ బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

⦿ హోండా సిటీ e:HEV  

Advertisement

హోండా సిటీ హైబ్రిడ్ కారు  ఏకంగా 27.13 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ. 19,99,900  నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్‌పై కొనుగోలుదారులు రూ. 1,97,000 వరకు ఆఫర్లు పొందే అవకాశం ఉంది. ఇందులో ఆటో బ్రేక్ హోల్డ్‌ తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కార్బన్ ఫినిష్ రియర్ బంపర్ డిఫ్యూజర్ కూడా ఉన్నాయి.

⦿ హోండా అమేజ్ సెకెండ్ జెనరేషన్  

హోండా అమేజ్ సెకెండ్ జెనరేషన్ కారు విశాలమైన సబ్ కాంపాక్ట్ సెడాన్ గా బాగా పాపులర్ అయ్యింది. ఈ నెలలో ఈ కారు పై రూ. 68,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కారు ధర రూ. 6,97,700 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో 1.2L i-VTEC పెట్రోల్ ఇంజిన్, అత్యంత సున్నితమైన CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ ను కలిగి ఉంటుంది. 420 లీటర్ బూట్‌ స్పేస్ ను కలిగి ఉంటుంది.

Read Also: ధరలు సవరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏ బైక్స్ ధరలు పెరిగాయి? ఏ బైక్స్ ధరలు తగ్గాయంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×