E-Paper
Advertisement

Royal Enfield bikes: ధరలు సవరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏ బైక్స్ ధరలు పెరిగాయి? ఏ బైక్స్ ధరలు తగ్గాయంటే?

Royal Enfield bikes: ధరలు సవరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏ బైక్స్ ధరలు పెరిగాయి? ఏ బైక్స్ ధరలు తగ్గాయంటే?
Advertisement

భారత్ లో అత్యంత ప్రసిద్ధ మోటార్‌ సైకిల్ బ్రాండ్‌లలో ఒకటైన రాయల్ ఎన్‌ఫీల్డ్.. GST 2.0 ధరల సవరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. హంటర్ 350, క్లాసిక్ 350, మెటియోర్ 350, బుల్లెట్ 350, గోవాన్ క్లాసిక్ 350 లాంటి ప్రసిద్ధ మోడళ్లతో సహా 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్‌ల ధరలు తగ్గాయి. అదే సమయంలో హిమాలయన్ 450, గెరిల్లా 450, స్క్రామ్ 440, 650cc లైనప్ లాంటి పెద్ద మోటార్‌ సైకిళ్లు ఎక్కువ GST కారణంగా, వాటి ధరలు పెరిగాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ తాజా ధరలు

⦿ హంటర్ 350(349cc): ప్రస్తుత ధర 1,49,900 ఉండగా, కొత్త ధర రూ. 1,34,910 కానుంది. సుమారు రూ. 14,990 తగ్గనుంది.

Advertisement

⦿ క్లాసిక్ 350(349cc): ఈ బైక్ ప్రస్తుత ధర రూ. 1,93,000.. కొత్త ధర రూ. 1,73,000. రూ 20,000 తగ్గింది.

⦿ మెటియర్ 350(349cc): ఈ బైక్ ప్రస్తుత థర రూ. 2,05,191 కాగా, ఇకపై రూ. 1,85,191 కానుంది. రూ 20,000 తగ్గనుంది.

Advertisement

⦿ బుల్లెట్ 350(349cc): ఈ బైక్ ధర రూ. 1,73,000 కాగా, ఇకపై రూ. 1,57,000కి తగ్గనుంది. రూ 17,000 చౌకగా లభించనుంది.

⦿ గోవాన్ క్లాసిక్ 350(349cc): ఈ బైక్ ప్రస్తుత ధర రూ. 2,35,000 కాగా, ఇకపై రూ. 2,11,500 కానుంది. రూ 23,500 తగ్గనుంది.

⦿ హిమాలయన్ 450(452cc): ఈ బైక్ ధర ప్రస్తుతం రూ. 2,85,000 కాగా, ఇకపై రూ.3,10,650 పలకనుంది. దీని ధర రూ. 25,650 పెరగనుంది.

⦿ గెరిల్లా 450 (452cc): ఈ బైక్ ధర రూ.  2,39,000 కాగా, ఇకపై రూ. 2,60,500 కానుంది. సుమారు రూ. 21,510 పెరగనుంది.

⦿ స్క్రామ్ 440( 443cc): ఈ బైక్ ధర రూ.2,08,000 కాగా, ఇకపై రూ. 2,26,700కి చేరనుంది.  దీని ధర రూ. 18,720 పెరగనుంది.

⦿ సూపర్ మెటియోర్ 650(648cc): ఈ బైక్ ధర రూ. 3,72,000 కాగా, ఇకపై రూ. 4,05,480కి చేరనుంది. దీని ధర రూ. 33,480 పెరగనుంది.

⦿ షాట్‌ గన్ 650(648cc): ఈ బైక్ ధర రూ. 3,67,000 కాగా, ఇకపై 4,00,030కి చేరనుంది. దీని ధర రూ. 33,030  పెరగనుంది.

⦿  ఇంటర్‌ సెప్టర్ 650(648cc) ఈ బైక్ ధర ప్రస్తుతం రూ. 3,09,551 కాగా, ఇకపై రూ. 3,37,400 ఉంటుంది. దీనిపై రూ. 27,859 పెరగనుంది.

⦿  క్లాసిక్ 650(648cc): ఈ బైక్ ధర రూ.3,36,610  కాగా, ఇకపై రూ. 3,66,904కి చేరుకుంటుంది. ఈ బైక్ ధర రూ. 30,294కి చేరనుంది.

⦿ బేర్ 650(648cc) ఈ బైక్ ధర ప్రస్తుతం రూ. 3,46,000 ఉండగా, ఇకపై రూ. 3,77,100కి చేరనుంది. మొత్తంగా ఈ బైక్ ధర రూ.31,100 పెరగనుంది.

కొత్త GST ప్రకారం ధరల సవరణ

350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలపై GST రేటును 28% నుంచి 18%కి తగ్గించారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హై వాల్యూమ్ మోటార్‌ సైకిళ్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. అటు హిమాలయన్, గెరిల్లా, స్క్రామ్, ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ GT వంటి 650cc మోడళ్లతో సహా 400cc కంటే ఎక్కువ మోటార్‌సైకిళ్లకు, GST రేటు 28% నుంచి 40%కి పెరిగింది. దీని ఫలితంగా ఆయా బైక్స్ ధరలు పెరగనున్నాయి.

Read Also: మరింత చౌకగా హార్లే డేవిడ్సన్ బైక్స్.. ఎందుకో తెలుసా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×