E-Paper
Advertisement

The Raja Saab Piracy Print: రెస్టారెంట్‌లో పబ్లిక్‌గా ది రాజా సాబ్ పైరసీ ప్రింట్ ప్రదర్శన.. ఇదెక్కడి ఘోరం!

The Raja Saab Piracy Print: రెస్టారెంట్‌లో పబ్లిక్‌గా ది రాజా సాబ్  పైరసీ ప్రింట్ ప్రదర్శన.. ఇదెక్కడి ఘోరం!
Advertisement

The Raja Saab Piracy Print: ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా ది రాజా సాబ్.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా వంటి విదేశీ దేశాల్లో కూడా ప్రీమియర్ షోలకు మంచి సేల్స్ తెచ్చుకుంది. అయితే సినిమా విడుదలైన వెంటనే.. ఒక షాకింగ్ విషయం బయటకు రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.

అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, డబ్లిన్ నగరంలో ఉన్న ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్‌లో ది రాజా సాబ్ సినిమా అక్రమంగా ప్రదర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విడుదలైన కేవలం ఒక రోజులోనే..థియేటర్ కాకుండా రెస్టారెంట్‌లో టీవీపై ఈ సినిమాను ప్లే చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా పూర్తిగా పైరేటెడ్ ప్రింట్ అని తెలిసి సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ వీడియోను ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశాడు. రెస్టారెంట్ యాజమాన్యం ఎలా ఈ ప్రింట్‌ను పొందిందని అతడు ప్రశ్నించాడు. థియేటర్‌లో కాకుండా పబ్లిక్ ప్లేస్‌లో ఇలా సినిమాను చూపించడం చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి కఠిన చట్టాలు ఉన్న దేశంలో ఇలా జరగడం మరింత షాక్ కలిగిస్తోంది.

?utm_source=ig_web_copy_link

మరి ఇంత అన్యాయమా..!

Advertisement

ఇటీవలే పైరసీపై చర్యలు కఠినంగా తీసుకుంటున్నామని సినిమా ఇండస్ట్రీ భావిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం నిరాశ కలిగిస్తోంది. ఐబొమ్మ వంటి వెబ్‌సైట్ల ద్వారా సినిమాలు లీక్ చేసిన కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ.. ఇంకా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని పలువురు అంటున్నారు.

పైరసీ వల్ల నిర్మాతలు..దర్శకులు, నటులు ఎంతో నష్టపోతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే, ఇలా అక్రమంగా ప్రదర్శించడం వల్ల సినిమా ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెస్టారెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి వాటికి ఉదాహరణగా శిక్ష పడాలని అభిమానులు కోరుతున్నారు.

ఈ ఘటనపై అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే ప్రభాస్.. అభిమానులు మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైరసీకి పూర్తిగా చెక్ పెట్టేలా ప్రభుత్వం, అధికారులే కాకుండా ప్రేక్షకులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

ALSO READ: Siddu Jonnalagadda : ఫ్రీగా సినిమాలు చేస్తున్న జొన్నలగడ్డ… వామ్మో ఎంత మార్పు?

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×