E-Paper
Advertisement

KTM RC 160 vs Yamaha R15M: మార్కెట్లోకి అడుగు పెట్టిన KTM RC 160.. యమహా R15Mతో పోల్చితే బెస్టా? కాదా?

KTM RC 160 vs Yamaha R15M: మార్కెట్లోకి అడుగు పెట్టిన KTM RC 160.. యమహా R15Mతో పోల్చితే బెస్టా? కాదా?
Advertisement

ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ కంపెనీ KTM మార్కెట్లోకి సరికొత్త బైక్ ను లాంచ్ చేసింది. KTM RC 160 పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ బైక్ యమహా కంపెనీకి చెందిన R15తో పోటీ పడుతోంది. ఇంతకీ ఈ రెండు బైక్ లలో ఏది బెస్ట్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డిజైన్ ఎలా ఉందంటే?

ఈ రెండు బైక్‌ల డిజైన్ చాలా రగ్డ్ గా ఉంటుంది. మంచి స్టైల్ లో యువతను ఆకట్టుకునేలా ఉంటాయి. KTM RC 160 హై పర్ఫార్మెన్స్ ఉన్న RC 200, RC 390 మాదిరిగానే ఉంటుంది.  అటు యమహా R15M  కూడా హై ఫర్ఫార్మెన్స్ కలిగిన  యమహా R1 లాగే ఉంటుంది. రెండింటిలోనూ, R15M స్టైలింగ్‌ను చాలా బాగుంటుంది. R1 లాంటి డిజైన్ కారణంగా చాలా ప్రీమియంగా లుక్ లో ఉంటుంది.

ఇంజన్, పనితీరు

Advertisement

KTM RC 160 పవర్ అనేది KTM 160 డ్యూక్ మాదిరిగానే ఉంటుంది. ఇది 164.2సీసీ, లిక్విడ్ కూల్డ్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 9,500 rpm దగ్గర 18.73 bhp పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 7,500 rpm దగ్గర 15.5 Nm ఉత్పత్తి చేస్తుంది.  Yamaha R15M 155సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ తో  వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) టెక్నాలజీతో పని చేస్తుంది. దీని మోటార్ 10,000 rpm దగ్గర 18.2bhp, 7,500 rpm దగ్గర 14.2 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. VVA టెక్నాలజీతో, ఇంజిన్ rev శ్రేణి అంతటా మంచి టార్క్ ను అందిస్తుంది. పని తీరు  విషయానికి వస్తే, KTM RC 160..  Yamaha R15M కంటే బాగుంటుంది.

బిల్ట్ క్వాలిటీ

KTM RC 160 ట్రేల్లిస్ ఫ్రేమ్‌ మీద నిర్మించబడింది. WP అపెక్స్ ఇన్‌వర్టెడ్ ఫోర్క్, మోనోషాక్ సెటప్‌ పై సస్పెండ్ చేయబడింది. ఈ బైక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే 320 mm ఫ్రంట్,  230 mm రియర్ డిస్క్ బ్రేక్ సెటప్ ను కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్ స్పోక్స్ పై అమర్చబడి ఉంటుంది.

Advertisement

R15M డైమండ్ టైప్ ఫ్రేమ్ పై నిర్మించబడింది. 37 mm ఇన్వర్టెడ్ ఫోర్క్, మోనోషాక్ సెటప్ ను కలిగి ఉంటుంది. RC 160 లాగానే, ఇది 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ సెటప్ లో ముందు 282mm, వెనుక 220mm  డిస్క్ బ్రేక్ లు ఉంటాయి. RC 160 స్పోక్ మౌంటెడ్ డిస్క్ బ్రేక్ సెటప్ హ్యాండ్లింగ్ ను మెరుగుపరుస్తుంది. పెద్ద ఫ్రంట్, రియర్ బ్రేక్ రోటర్లు మెరుగైన హీట్ డిసిపేషన్ కు సహాయపడతాయి. బ్రేకింగ్ పని తీరును మెరుగుపరుస్తాయి.

ఫీచర్స్

KTM RC 160 లో LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇది R15M TFT యూనిట్ తో పోలిస్తే ప్రైమరీగా కనిపిస్తుంది. R15M కన్సోల్ కూడా మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.  ఇది విదేశాలలో ఎక్కువ సామర్థ్యం కలిగిన మోడళ్లలో అందించే వాటి మాదిరిగా కనిపిస్తుంది. అయితే, KTM త్వరలో TFT కన్సోల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇది KTM 160 డ్యూక్‌ తో సమానంగా ఉంటుంది. RC 160 కంటే R15M కలిగి ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే అప్‌ షిఫ్ట్‌ లకు ఫాస్ట్ షిఫ్టర్ ఉంటుంది. యమహా R15M,  KTM RC 160 కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది. మరింత ప్రీమియంగా అనిపిస్తుంది.

ధర ఎంత? ఏది బెస్ట్?

KTM RC 160 ధర రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. యమహా R15M రూ. 1.81 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. RC 160 పేపర్ మీద పనితీరులో అద్భుతంగా ఉంది. అండర్‌పిన్నింగ్స్ పరంగా కూడా ఫర్వాలేదు. యమహా R15M కూడా ఇదే స్థాయి పని తీరునే అందిస్తుంది. కానీ, మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. యమహా R15M కన్సోల్, మొత్తం డిజైన్ కారణంగా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది.

Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 Vs యమహా XSR 155.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×