E-Paper
Advertisement

ఒక్క నెలలో 5.18 లక్షల బైక్స్ అమ్మకం.. హోండా సేల్స్ బూమ్ వెనుక అసలు మ్యాటర్ ఏంటంటే?  

ఒక్క నెలలో 5.18 లక్షల బైక్స్ అమ్మకం.. హోండా సేల్స్ బూమ్ వెనుక అసలు మ్యాటర్ ఏంటంటే?  
Advertisement

Honda Motorcycle Sales May 2026:  మే 2026లో హోండా కంపెనీ అమ్మకాల్లో దుమ్మురేపింది. దేశీయ మార్కెట్‌ తో పాటు ఎగుమతుల్లో కూడా డిమాండ్ పెరగడంతో కంపెనీ మొత్తం అమ్మకాలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఈ నెలలో హోండా మొత్తం 5,18,777 టూ వీలర్స్ ను అమ్మింది. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 4,65,109 యూనిట్లుగా ఉండగా, దాదాపు 12 శాతం వృద్ధి నమోదైంది.

దేశీ అమ్మకాలతో పాటు ఎగుమతుల్లోనూ సత్తా

దేశీయ అమ్మకాల్లో కంపెనీ మంచి గ్రోత్ సాధించింది. మే 2025లో 4,17,250 యూనిట్లు అమ్ముడవగా, మే 2026లో ఈ సంఖ్య 4,59,611 యూనిట్లకు చేరుకుంది. అంటే, దేశీయ మార్కెట్‌ లో సుమారు 10 శాతం వృద్ధి నమోదైంది. ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌ లో డిమాండ్ ఎలా ఉందో సూచిస్తోంది.

Advertisement

ఎగుమతుల విభాగంలో హోండా మరింత మంచి ఫలితాలు సాధించింది. గతేడాది మేలో 47,859 యూనిట్లు ఎగుమతి చేయగా, ఈసారి 59,166 యూనిట్లకు పెరిగాయి. అంటే ఎగుమతులు 24 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా హోండా ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉందనేది సూచిస్తుంది.

మొత్తం అమ్మకాలలో దేశీయ మార్కెట్ ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, ఎగుమతుల వృద్ధి కంపెనీకి అదనపు బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా 59,000 యూనిట్లకు పైగా ఎగుమతులు నమోదు కావడం హోండా గ్లోబల్ మార్కెట్‌ లో తన స్థిరమైన  స్థానం కొనసాగిస్తోందని అర్థం అవుతోంది.

Advertisement

Read Also: ఒక్క నెలలో ఇన్నిఈవీలా.. ఈ నెలలో మార్కెట్‌ ను షేక్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

అమ్మకాల్లో జోరుకు కారణం ఏంటి?

ఈ నెలకు సంబంధించిన మోడల్ వారీ అమ్మకాల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ, మొత్తం గణాంకాలు చూస్తే స్కూటర్ మరియు కమ్యూటర్ బైక్ సెగ్మెంట్లు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావించవచ్చు. మొత్తం మీద, మే 2026 హోండా కోసం స్థిరమైన, సానుకూల వృద్ధిని చూపించిన నెలగా నిలిచింది. దేశీయ డిమాండ్ బలంగా ఉండటం, ఎగుమతులు వేగంగా పెరగడం కంపెనీ భవిష్యత్ పనితీరుపై కూడా మంచి సంకేతాలు ఇస్తున్నాయి. ఇదే ఊపుతో కంపెనీ సరికొత్త బైకులను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుక ప్రయత్నిస్తోంది. పెట్రోల్ తో పాటు ఈవీ సెగ్మెంట్ లోనూ  సత్తా చాటాలని భావిస్తోంది.

Read Also: యమహా To ఏథర్.. ఈ నెలలో విడుదలయ్యే క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×