Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు రాబోతున్న పెద్ది మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీ ని ఎప్పుడు ఎప్పుడు థియేటర్లలో చూస్తామని రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదట మార్చిలోనే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ కొన్ని అనుకుని కారణాలవల్ల సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. జూన్ 4 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా పైనే టాపిక్ నడుస్తుంది.. రిలీజ్ కి ముందే రికార్డులను బ్రేక్ చేస్తుందని పెద్ది మూవీ పై పలువురు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఇప్పటివరకు ఈ మూవీకి జరిగినా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే టార్గెట్ ఎంత అన్నది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ క్రమంలో ఈ సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా అప్డేట్స్ రిలీజ్ అవ్వడంతో సినిమాపై జనాల్లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అంతే కాదు ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరగడంతో ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్క అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ఈ చిత్రం బిజినెస్ విషయానికొస్తే.. దాదాపుగా 218.5 కోట్ల మేర భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్.. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు. అయితే ఈ స్థాయి భారీ బిజినెస్ జరగడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా అవ్వాలంటే వసూళ్ల కలెక్షన్ కూడా భారీగానే ఉండాలి..
Also Read :ఫైనల్ గా సంక్రాంతి రేసులో పోటీ పడుతున్న స్టార్ హీరోలు..
రామ్ చరణ్ పెద్ది మూవీ బిజినెస్ మామూలుగా జరగలేదని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ దక్కింది. దాంతో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దికి బిజినెస్ జరిగింది.. 400 నుండి రూ. 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.. గతంలో వచ్చిన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఈ చిత్రం పై ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.. అయితే మొదటి రోజే ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో ఒక అంచనా ఉంది. ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ కి ఈ సినిమా భారీ హైప్ని తీసుకొచ్చింది.. సినిమా హిట్ అయితే మాత్రం గ్లోబల్ స్టార్ రేంజ్ ఇంకాస్త పెరుగుతుంది. మరి ఈ మూవీ ఏ మాత్రం లాభలను పొందుతుందో చూడాలి..