Priyanka Mohan: దక్షిణ భారత ప్రముఖ నటి ప్రియాంక మోహన్‌కు కొరియా టూరిజం ఆర్గనైజేషన్ (KTO) అరుదైన గౌరవాన్ని అందించింది. కొరియా పర్యాటక రంగం గౌరవ రాయబారిగా ఆమెను నియమించింది. ఈ సంతోషకరమైన వార్తను ప్రియాంక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ, తనకు దక్కిన ఈ ప్రతిష్టాత్మక గుర్తింపునకు కృతజ్ఞతలు తెలిపింది.
Read also-Sankranti Movies 2027: ఫైనల్ గా సంక్రాంతి రేసులో పోటీ పడుతున్న స్టార్ హీరోలు..
దక్షిణ కొరియాతో ఈ రకమైన అనుబంధం ఏర్పడటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రియాంక పేర్కొంది. ఈ బాధ్యతకు తనను ఎంపిక చేసినందుకు కొరియా ప్రభుత్వానికి, కొరియా టూరిజం ఆర్గనైజేషన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఈ అవకాశాన్ని ఎంతో ప్రత్యేకమైనదిగా అభివర్ణిస్తూ, రాబోయే ప్రయాణంపై తన ఉత్సాహాన్ని వ్యక్తంచేసింది.
ఆమె సోషల్ మీడియాలో రాస్తూ, “కొరియా టూరిజం గౌరవ రాయబారిగా నియమితులవడం నాకు నిజంగా చాలా ప్రత్యేకమైనది. కొరియా సంస్కృతిని భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయగల వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు కొరియా ప్రభుత్వానికి, కొరియా టూరిజం ఆర్గనైజేషన్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొంది.
అంతే కాకుండా.. “కొరియా సంస్కృతి, సంప్రదాయాలు వారి ఆప్యాయత నన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఈ అందమైన ప్రయాణంలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి, ఆత్మీయ స్వాగతం పలికిన కొరియా టూరిజం ఆర్గనైజేషన్ అధ్యక్షుడికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే అనుభవాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.”
Read also-‘హిరణ్యకశ్యప’ లో త్రివిక్రమ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన గుణ శేఖర్.. ఏం జరిగిందంటే?
ప్రియాంక మోహన్‌కు ఈ పదవి దక్కడం దక్షిణ కొరియాతో ఆమెకు ఉన్న అనుబంధంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు హాజరైన అధికారిక విందుకు కూడా ఆమెకు ఆహ్వానం లభించింది.
గత కొన్నేళ్లుగా కొరియా టూరిజంతో కలిసి పనిచేసిన భారతీయ సెలబ్రిటీల జాబితాలో ఇప్పుడు ప్రియాంక కూడా చేరింది. ఇంతకుముందు హీనా ఖాన్, అనుష్క సేన్ వంటి ప్రముఖులు కూడా గౌరవ రాయబారులుగా వ్యవహరించి, వివిధ ప్రచార కార్యక్రమాల ద్వారా భారతీయ ప్రేక్షకులలో దక్షిణ కొరియా సంస్కృతిని, పర్యాటకాన్ని ప్రోత్సహించారు.
Beyond grateful for this incredible honour 🇰🇷✨
Being appointed as the Honorary Ambassador for Korea Tourism is truly very special to me. I’m sincerely thankful to the Korean government and the Korea Tourism Organization for recognising me as someone who can help bring Korean… pic.twitter.com/Rpf0kUftHS
— Priyanka Mohan (@priyankaamohan) June 1, 2026