E-Paper
Advertisement

హోండా వినియోగదారులకు షాక్, ఏకంగా 40 వేల కార్లు రీకాల్!

హోండా వినియోగదారులకు షాక్, ఏకంగా 40 వేల కార్లు రీకాల్!
Advertisement

Honda Recalls Thousands of Vehicles: హోండా కంపెనీ వినియోగదారుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వాహన భద్రతకు సంబంధించి సంచలన విషయాన్ని తీసుకుంది. సుమారు 40,000 మినీ వ్యాన్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక కారణం ఎయిర్‌ బ్యాగ్ వ్యవస్థలో సాఫ్ట్‌ వేర్ లోపం అని వెల్లడించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రమాదం లేకపోయినా ఎయిర్‌ బ్యాగ్‌ లు అకస్మాత్తుగా తెరుచుకునే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. అయితే, ఈ రీకాల్ కేవలం కెనడాకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

Advertisement

ట్రాన్స్‌ పోర్ట్ కెనడా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఈ రీకాల్ 2018 నుండి 2022 మధ్య తయారైన కొన్ని హోండా ఒడిస్సీ మోడళ్లకు వర్తిస్తుంది. మొదట ఏప్రిల్ 9న ఈ నోటీసు ఇవ్వగా, ఆ తర్వాత ఏప్రిల్ 24న దీనిని అప్ డేట్ చేశారు. ఇందులో స్పష్టంగా చెప్పినదేమిటంటే, వాహనంలోని సైడ్ ఎయిర్‌ బ్యాగ్‌లు, సైడ్ కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్‌ లు సాఫ్ట్‌ వేర్ లోపంతో  అనుకోకుండా తెరుచుకునే అవకాశం ఉంది. వాహనం సాధారణంగా ప్రయాణిస్తున్న సమయంలోనే ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంటే, డ్రైవర్, ప్రయాణికులకు గాయాలు అయ్యే అవకాశముంది. అందుకే, ఈ సమస్యను ఈజీగా తీసుకోకుండా హోండా వెంటనే రీకాల్ ను అనౌన్స్ చేసింది.

కారు యజమానులకు ఈమెయిల్ ద్వారా సమాచారం

ఈ సమస్య తలెత్తిన వాహన యజమానులకు కంపెనీ నేరుగా మెయిల్ ద్వారా సమాచారం అందిస్తుంది. వాహనదారులు తమ వాహనం ఈ రీకాల్‌ లిస్టులో ఉందా? లేదా? అనేది అధికారిక వెబ్‌ సైట్ ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ సమస్యను ఎదుర్కొంటున్న కారు యజమానులు సమీపంలోని డీలర్‌ షిప్‌ ను సంప్రదించాలని సూచించారు.

రీకాల్ వాహనాల్లో ఏ మార్పులు చేస్తారంటే?

Advertisement

ఇక రీకాల్ కార్లలో సప్లిమెంటల్ రెస్ట్రైంట్ సిస్టమ్ (SRS)కు చెందిన ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU)ను మళ్లీ ప్రోగ్రామ్ చేయడం లేదంటే పూర్తిగా మార్చనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ప్రక్రియ అంతా ఉచితంగా చేయనున్నారు. వాస్తవానికి హోండా ఇటీవల కూడా ఇలాంటి సమస్యల కారణంగా కొన్ని వాహనాలను రీకాల్ చేసింది. గత సంవత్సరం డిసెంబర్‌ లో, 2016 నుంచి 2020 మధ్య తయారైన హోండా అక్యూరా మోడళ్లలో బ్రేక్ వ్యవస్థలో సమస్యలు గుర్తించడంతో దాదాపు 11,000 వాహనాలను రీకాల్ చేసింది. వాహన భద్రత విషయంలో హోండా తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల రక్షణకు అత్యంత ముఖ్యమైనది. చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని గుర్తించి, ముందుగానే చర్యలు తీసుకోవడం ద్వారా కంపెనీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. కంపెనీ నిర్ణయం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: కార్లకు కొత్త తెలివి.. నోటి మాటతో చెప్పిన పని చేసేస్తాయ్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×