E-Paper
Advertisement

జిమ్‌కి వెళ్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? అయినా గుండెపోటు వస్తోంది.. ఎందుకో తెలుసా?

జిమ్‌కి వెళ్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? అయినా గుండెపోటు వస్తోంది.. ఎందుకో తెలుసా?
Advertisement

Heart Attack: అప్పటిదాకా మనతో సరదాగా గడిపిన మన వాళ్ళు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి చనిపోయారనే వార్తలు వినగానే ఒక్కసారిగా మన గుండె జారిపోతుంది. ప్రస్తుతం ఇది ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే న్యూస్ తరచుగా వినబడుతుంది.

ఇక్కడ చాలా మంది చేస్తున్న తప్పు

Advertisement

మొన్నామధ్య మధురవాడకి చెందిన 37 ఏళ్ల మహేష్ కి అర్థరాత్రి ఛాతీలో అన్ ఈజీగా అనిపించిందట. మామూలేలే అని కుటుంబ సభ్యులు లైట్ తీసుకున్నారు. కట్ చేస్తే ఉదయానికల్లా శవం అయిపోయాడు.కర్నూల్ కి చెందిన కుమార్ కి తెల్లవారుజామున గుండెల్లో మంటగా అనిపించింది. అతను కూడా ‘గ్యాస్ పెయిన్’ అయ్యుంటుంది లే అన్న నిర్లక్ష్యంతో ఒక టాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు. అంతే పడుకున్న వాడు మళ్ళీ లేవలేదు.ఇక్కడ చాలా మంది చేస్తున్న తప్పు ఏంటో తెలుసా… ఛాతీలో వచ్చే ప్రతి మంటని, గుండెలో అనిపించే దడని కామన్ గా వచ్చేవే అంటూ తేలిగ్గా తీసిపారేయడమే.

వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం

Advertisement

గుండెపోటు అనేది పలానా ఏజ్ వారికే రావాలని లేదు. జిమ్ లో ఎక్సర్ సైజులు చేస్తూ ఫిట్ గా కనిపించే వారి నుండి స్కూల్ పిల్లల వరకు ఎందఱో ఈ సైలెంట్ కిల్లర్ కి బలై పోతున్నారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్‌గా గుండెపోటు నిలిచిందని సమాచారం. ముఖ్యంగా ఈ గుండెపోటు ఎటాక్ చేయడానికి ప్రధాన కారణం మన లైఫ్ స్టైల్ అనే చెప్పాలి. కరోనా తర్వాత చాలా మందికి రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టే సమస్యలు పెరిగాయని డాక్టర్స్ చెబుతున్నారు. దీంతో పాటుగా చైన్ స్మోకింగ్, వర్క్ ప్రెజర్ విపరీతంగా ఉండటం, బాడీకి 8 గంటల నిద్ర లేకపోవడం వంటివి గుండె పోటుకి దారి తీస్తున్నాయి.

also read :స్టేజీపైనే ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్….నెట్టింట వైరల్

నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతులు

ఇక వీటికి తోడు నాన్ వెజ్ విపరీతంగా తినడం, నూనెతో నిండిన వస్తువులు ఎడా పెడా లాగించడం, మసాలాతో కూడిన ఫుడ్ ని ఆవురావురు మంటూ ఆరగించడం, ఇంటి భోజనం పక్కన పెట్టి అవుట్ సైడ్ ఫుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వంటి కారణంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోతుంది.దాని వల్లే గుండెకి సరిగ్గా పంప్ కావాల్సిన బ్లడ్ అవకుండా గుండె ఆగిపోయే పరిస్థితి. ముఖ్యంగా మాదేం పెద్ద వయసు కాదు కదా అని నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్.

ప్రాణాలు వదిలేసే పరిస్థితి

ఇకనైనా మీరు కనుక 40 ఏళ్లు దాటినా లేక ఫ్యామిలీలో ఎవరికైనా గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ‘సీటీ యాంజియో’ చేయించుకోవడం ముఖ్యం అంటూ తేల్చి చెబుతున్నారు హార్ట్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కడ ఉన్నా యాంజియో చేయించారంటే ముందే బయటపడుతుంది. ఇక మీకు గనుక మధుమేహం ఉంటె మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే వారికి గనుక గుండెపోటు వస్తే ఆ నొప్పి తెలీకుండానే ప్రాణాలు వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. దాన్నే ‘సైలెంట్ అటాక్’ అంటారు. అంటే మీకు నొప్పి తెలిసే లోపే ప్రాణం పోతుందన్నమాట.

ఉరుకుల పరుగుల జీవితానికి రోజు కాసేపు బ్రేక్

సో ..గుండెపోటు దరి చేరకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని రోజుకి కనీసం 45 నిమిషాల పాటు, వారంలో ఐదు రోజులు నడిచి ఒళ్ళంతా చెమటలు పట్టించాలి.నడక అనేది రక్తనాళాలను శుభ్రం చేసే చీపురు లాంటిదన్న మాట. దీంతో పాటు నాన్ వెజ్ మానేసి తినే ఆహరంలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకుంటే చాలా మంచిది.ఇక రోజూ టెన్షన్ తో ఉంటె బ్లడ్ ప్రెజర్ పెరిగిపోయి గుండె వద్ద రక్త నాళాలు చిట్లిపోయే ప్రమాదం పుష్కలంగా ఉంటుంది. సో ఈ ఉరుకుల పరుగుల జీవితానికి రోజు కాసేపు బ్రేక్ ఇచ్చి మిమ్మల్ని మీరు పట్టించుకుంటే మంచిది.

అలా కాకుండా కెరీర్ కెరీర్ అనుకుంటూ పరిగెడితే, తర్వాత ఆ కెరీర్ ని చూడటానికి మీరే ఉండరు అన్నది గుర్తుంచుకోండి !

also read :రికార్డుల రారాజు.. బయోపిక్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్! మైఖేల్ మేనియాకు బాక్సాఫీస్ షేక్!

Related News

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

Big Stories

Advertisement
×