E-Paper
Advertisement

సంవత్సరానికి పది లక్షల రిఫ్రిజిరేటర్లు.. భారత్ లో కూల్ డ్రింక్స్ హవా.. వేసవిలో సేల్స్ ఎంతంటే?

సంవత్సరానికి పది లక్షల రిఫ్రిజిరేటర్లు.. భారత్ లో కూల్ డ్రింక్స్ హవా.. వేసవిలో సేల్స్ ఎంతంటే?
Advertisement

Cool Drinks Sales: భారత్ లో కూల్ డ్రింక్స్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతుంది. ఇందుకు కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్ సంఖ్యే నిదర్శనం. ప్రతి సంవత్సరం సుమారు పది లక్షల రిఫ్రిజిరేటర్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ కంపెనీలు తమ సేల్స్ పెంచుకోవడానికి, కిరాణా షాపులు, చిన్న చిన్న అవుట్‌లెట్లలో కూలింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. ఈ ఏర్పాట్లను బట్టి ప్రజలు ఎక్కువగా ఏం తాగుతున్నారనేది కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

ఏటా పది లక్షల కూలింగ్ పరికరాలు

కూల్ డ్రింక్స్ కంపెనీలు, రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా మార్కెట్ లోకి ఏటా సుమారు పది లక్షల కూలింగ్ పరికరాలు, రిఫ్రిజిరేటర్లను పంపిణీ చేస్తున్నాయని వరుణ్ బెవరేజెస్ ఛైర్మన్ రవి జైపురియా తెలిపారు. ఈ కామెంట్స్ దేశంలో కూల్ డ్రింక్స్ మార్కెట్‌ విస్తరణ, కంపెనీ మధ్య పోటీ, కొనుగోళ్లను తెలియజేస్తు్న్నాయని నిపుణులు అంటున్నారు. కూలింగ్ పరికరాల సంఖ్య పెరుగుతుండడం బట్టి కొనుగోళ్లను అంచనా వేయవచ్చని అంటున్నారు. ముఖ్యంగా వేసవి నెలల్లో దుకాణాలు, రెస్టారెంట్లు, ప్రయాణ ప్రదేశాలలో కూల్ డ్రింక్స్ కు భారీగా డిమాండ్ ఉంటుంది. దీంతో ఈ ప్రదేశాల్లోని షాపులకు కంపెనీలు కూలింగ్ పరికరాలను ఉచితంగా అందిస్తున్నాయి.

మెట్రో నగరాలను దాటి

Advertisement

కూల్ డ్రింక్స్ యూనిట్లకు డిమాండ్ పెరుగుతుండడంతో.. విస్తృత పంపిణీ, కూలింగ్ పరికరాలు ఏర్పాటు ముఖ్యమైనవిగా కంపెనీలు భావిస్తున్నాయి. దేశంలో కూల్ డ్రింక్స్ మార్కెట్ మెట్రో నగరాలను దాటి పట్టణాలు, మండలాలు, గ్రామాల వరకూ విస్తరిస్తోందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. అంతేకాకుండా, డిమాండ్‌ను బట్టి ఆకర్షణీయమైన ప్రకటనలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా అంతే ముఖ్యమవుతుందని చెబుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్, వివిధ సైజుల్లో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు ప్రొడెక్ట్స్ అందుబాటులోకి తెస్తున్నాయి.

రానున్న ఐదేళ్లలో

మారుతున్న వాతావరణ పరిస్థితులతో రాబోయే ఐదు నుంచి పదేళ్లలో దేశంలో కూల్ డ్రింక్స్ వినియోగం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండంకెల వృద్ధికి ఆస్కారం ఉందంటున్నారు. డిమాండ్ కు తగిన విధంగా పంపిణీ, కోల్డ్-చైన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలని నిపుణులు భావిస్తున్నారు.

వేసవిలోనే 40 శాతం సేల్స్

Advertisement

గత సంవత్సరం కూల్ డ్రింక్స్ సేల్స్ కాస్త మందకొడిగా ఉన్నా.. రాబడులు సుమారు 15% పెరిగాయి. సాధారణంగా వేసవిలో వార్షిక అమ్మకాలలో దాదాపు 40% సేల్స్ అవుతాయని క్రిసిల్ రేటింగ్ సంస్థ తెలిపింది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం, దానికి తోడు ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ఉపశమనం కోసం ఎక్కువగా కూల్ డ్రింక్స్ పై ఆధారపడుతున్నారు.

Also Read: రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

కార్బోనేటెడ్ డ్రింక్స్, జ్యూస్‌లు, ప్యాకేజ్డ్ వాటర్ సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. గత రెండేళ్లలో కంపెనీలు తమ బాట్లింగ్ సామర్థ్యాలను 30–35% పెంచుకోవడంతో పాటు, పంపిణీ కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలను కూడా విస్తరించాయి. స్వల్పంగా ధరలు పెంచడంతో రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్నాయి కంపెనీలు. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన సంస్థలు దేశీయ రుచులతో పాటు రూ.10, రూ.20 వంటి చౌక ధరలలో ఉత్పత్తులను అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో వీటి మార్కెట్ వాటా 6-7%కి పెరిగింది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×