E-Paper
Advertisement

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Honda UC3 Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌ లోకి హోండా వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తోంది. ఇప్పటికే భారత మార్కెట్ కోసం QC3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసిన ఈ జపాన్ కంపెనీ.. తాజాగా మరో మోడల్‌కు ఇండియాలో పేటెంట్ పొందింది. అదే హోండా UC3. ప్రస్తుతం ఈ స్కూటర్ థాయ్‌లాండ్, వియత్నాం లాంటి విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉంది. అయితే, భారత్‌ లో పేటెంట్ రావడంతో ఈ మోడల్‌పై ఆసక్తి పెరిగింది.

క్రూయిజర్ లుక్‌ తో ఆకట్టుకునేలా..

హోండా UC3 సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. విశాలమైన బాడీ, ఫ్లోయింగ్ డిజైన్ లైన్లతో క్రూయిజర్ తరహా లుక్ ను కలిగి ఉంటుంది. పెద్ద సీటు కారణంగా సుదీర్ఘ ప్రయాణాల్లోనూ సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని రూపొందించారు. సీటు కింద ఏకంగా 26 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది.

LFP బ్యాటరీతో అందుబాటులోకి..

Advertisement

UC3లో ఉన్న ప్రధాన ప్రత్యేకత బ్యాటరీ. హోండా QC1, యాక్టివా E వంటి మోడళ్లలో NMC బ్యాటరీలను ఉపయోగిస్తుండగా.. UC3లో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని ఉపయోగిస్తున్నారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 122 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ విషయంలోనూ రెండు ఆప్షన్లు ఉన్నాయి. 450W ఛార్జర్‌తో బ్యాటరీని 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటలు పడుతుంది. అదే 1200W ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే ఈ సమయం దాదాపు 2 గంటలకు తగ్గుతుంది.

గంటకు 120 కిలోమీటర్ల వేగం

పనితీరు విషయంలో UC3 ఏమాత్రం తగ్గదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6kW గరిష్ట పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముందు, వెనుక భాగాల్లో 12 అంగుళాల చక్రాలను అమర్చారు. స్కూటర్ బరువు 129 కిలోలు కాగా.. సీటు ఎత్తు 779 మిల్లీమీటర్లుగా ఉంది.  రైడర్ అవసరాన్ని బట్టి UC3లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. స్టాండర్డ్, స్పోర్ట్, ఎకాన్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. వీటితో పాటు రివర్స్ మోడ్ కూడా అందించారు. 5 అంగుళాల TFT డిస్‌ప్లే ద్వారా ఈ ఫీచర్లను నియంత్రించుకోవచ్చు.

ఇండియాకు వస్తుందా?

Advertisement

హోండా UC3కి భారత్‌లో పేటెంట్ లభించడంతో కచ్చితంగా వస్తుందని భావిస్తున్నారు. అయితే, కంపెనీలు తమ కొత్త ఉత్పత్తుల డిజైన్, టెక్నాలజీకి రక్షణ కోసం ముందుగానే పేటెంట్లు తీసుకోవడం సాధారణమే. అందువల్ల UC3 పేటెంట్ రావడం.. భారత్‌లో లాంచ్‌కు కచ్చితమైన సంకేతం కాదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. అయితే, భవిష్యత్తులో హోండా ఈ క్రూయిజర్ స్టైల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను మన మార్కెట్లోకి తీసుకొస్తే.. మంచి ఫీచర్లు, 120 కిలోమీటర్ల వేగం, LFP బ్యాటరీ కారణంగా ఈ మోడల్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

Read Also: 100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Tags

Related News

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

Big Stories

Advertisement
×