E-Paper
Advertisement

భారత్ లో హోండా WN7కి పేటెంట్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్ లో హోండా WN7కి పేటెంట్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎంట్రీ ఎప్పుడంటే?
Advertisement

Honda WN7 EV Bike: భారత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో హోండా ఇండియా నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ రాబోతోంది. తాజాగా హోండా WN7 డిజైన్‌ కు సంబంధించి భారత్ పేటెంట్ కోసం అప్లై చేసింది.  హోండా త్వరలోనే దేశంలో తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురావచ్చనే చర్చ మొదలైంది.

ఇప్పటికే హోండా WN7 కాన్సెప్ట్‌  ప్రదర్శన

హోండా WN7 కాన్సెప్ట్‌ ను తొలిసారి EICMA 2025 మోటార్ షోలో ప్రదర్శించారు. ఈ బైక్ తన ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దీనికి భారత్‌ లో పేటెంట్ రావడం వల్ల, ఈ మోడల్‌ ను ఇక్కడి మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, ఎప్పుడు వస్తుందనే విషయంలో కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రారంభ దశలో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్

Advertisement

ప్రస్తుతం భారత్ లో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఎక్కువ అమ్మకాలు ఇప్పటికీ ఎలక్ట్రిక్ స్కూటర్లకే పరిమితమయ్యాయి. కానీ, యువతలో స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్‌ లపై ఆసక్తి నెమ్మదిగా పెరుగుతోంది. అల్ట్రావయోలెట్ F77, ఓలా రోడ్‌ స్టర్, ఓబెన్ రోర్ లాంటి మోడళ్లు మార్కెట్లోకి రావడంతో ఈ సెగ్మెంట్‌ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో  హోండా కూడా ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో హోండా సత్తా

హోండా ఇప్పటికే యాక్టివా e, QC1 లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు WN7 ద్వారా స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

WN7కు ఫ్యూచరిస్టిక్ డిజైన్

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, WN7 ఫ్యూచరిస్టిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. సూపర్ స్టైల్ బాడీ ప్యానెల్స్, షార్ప్ లైన్స్, పూర్తి LED లైటింగ్ సెటప్ ఈ బైక్‌ కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. స్ట్రీట్‌ ఫైటర్ తరహా లుక్‌ తో యువతను ఆకట్టుకునేలా హోండా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఒకే ఛార్జ్ తో 140 కి.మీ రేంజ్

పవ, బ్యాటరీ విషయాల్లో కూడా ఈ బైక్ ఆకట్టుకునే అవకాశముంది. ఇందులో 50kW శక్తిని ఉత్పత్తి చేసే లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండొచ్చని తెలిసింది. బైక్‌ లో 9.3kWh బ్యాటరీ ప్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఛార్జ్ తో సుమారు 140 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు.  గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవకాశం ఉంటుంది. పనితీరు పరంగా కూడా ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.

అత్యాధునిక ఫీచర్లు

ఫీచర్ల పరంగా కూడా WN7 చాలా అడ్వాన్స్‌ గా ఉండే అవకాశముంది. కార్నరింగ్ ABS, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్, TFT డిస్‌ ప్లే, స్పీడ్ లిమిట్ అసిస్ట్ లాంటి టెక్నాలజీ అందించే అవకాశం ఉంది. ఫార్వర్డ్, రివర్స్ మోడ్‌ లు కూడా ఉంటాయని తెలుస్తోంది. సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ కూడా ప్రీమియం స్థాయిలో ఉంటాయి. USD ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ABSతో డిస్క్ బ్రేకులు ఇవ్వొచ్చని సమాచారం. హోండా WN7 భారత మార్కెట్లోకి వస్తే, ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది.

Read Also: టాటా డబుల్ బ్లాస్ట్.. మే 22న సియెర్రా EV, సఫారీ EV లాంచ్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×