కేటీఆర్ ఆదేశించాడు.. ఆరెస్ ప్రవీణ్ పాటించాడు… పాటించాడు అనే బదులు రెచ్చిపోయాడు అని అనాలేమో. ఒక రకంగా బండి భగీరథ్ కేసు విషయంలో మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బీఆరెస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రెస్‌మీట్.. ఆ తదుపరి స్పందించిన తీరు ఓవర్ యాక్షన్ అనే చెప్పాలి. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి క్రిమినల్ సెక్షన్లన్నీ తెలుసు కాబట్టి.. పక్కాగా మాట్లాడి రాజకీయంగా ఇరుకున పెట్టడం వారి ఉద్దేశం కావొచ్చు. కానీ ప్రవీణ్ కుమార్ .. స్కూప్ వార్తలు రాసినట్టుగానే నాకు తెలిసింది. నాకు చెప్పారు. నేను మాట్లాడాను. బండి సంజయ్ ఇలా బెదిరించాడట.. అని ఏవేవో కల్పిత కథనాల మాదరిగా వండి వార్చినట్టు అనిపించింది. ఇది కొంచెం ఓవరే అంటున్నారంతా.
ఇక చాలా ఫోటోలు తీసి చూపించాడు. పాత వీడియోలు ప్లే చేశాడు. ఆ కేసు పరిధి, ప్రస్తుత స్టేటస్, డిమాండ్.. వరకు సరిపెట్టుకుంటే సరిపోయేది.. తన సహజ శైలికి భిన్నంగానే వెళ్లాడు ప్రవీణ్. పనిలో పని జై హిందూ.. అంటూ హనుమాన్ జయంతి నాడు.. బండి సంజయ్ కొడుకు కేసును లింక్ చేస్తూ.. ఆ వర్గానికేదో మెసేజ్ ఇచ్చే ప్రయత్న చేశాడు. పనిలో పని బీజేపీలో కొనసాగుతున్న సంగప్ప విలేకరిపైనా కథనాలు చెప్పాడు. సేమ్ బీఆరెస్ సోషల్ మీడియా చేసిందే… యాక్షన్‌లో ప్రవీణ్ చేశాడన్నమాట. సరే, ఇవన్నీ ఒకెత్తయితే.. ఇంకొంచెం అత్యుత్సాహం చూపే క్రమంలో ప్రవీణ్ కుమార్.. టక్కున మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసు ఉదంతం బయటకు తీశాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మరి ఇది ముందుగా అనుకున్న షెడ్యూల్‌లో ఉందో లేదో .. అలా మంచి ఫామ్‌లో ఉన్నా కదా.. అని నోరు జారాడో తెలియదు కానీ.. షకీల్ కొడుకు రాహిల్ గురించి తీశారు.
అంటే.. ఆయన ఉద్దేశం ఏంటంటే.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ విషయంలో ఒకలా.. బండి సంజయ్ కొడుకు విషయంలో ఒకలా పోలీసులు ప్రవర్తించారని చెప్పాలనుకున్నాడు. పనిలో పని ఇండైరెక్టుగా మా షకీల్ కొడుకు అమాయకుడు.. కానీ కేసులు పెట్టి టార్చర్ పెట్టారనే కోణంలోనే ఉంది ఆయన మాట్లాడిన తీరు. పద్దతి. అసలేం జరిగింది? షకీల్ కొడుకు రాహిల్ పై రెండు సార్లు హైదరాబాద్ హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓసారి తీగల వంతెన వద్ద కారుతో గుద్దితే ఓ మహిళ చేతిలో పసికందు చనిపోయిన ఘటన.. ఆ తరువాత ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన ఘటన.. రెండో సంఘటనలోనైతే కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉంది. షకీల్ కొడుకే డ్రైవింగ్ చేస్తున్నాడని స్పాట్లో పోలీసులు గుర్తించారు.
అక్కడా హిట్ అండ్ రన్ కేసు పెట్టి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు. అయినా దుబయ్ పారిపోయాడు. మళ్లీ కోర్టు జోక్యంతో పోలీసుల ముందు సరెండరయ్యాడు. మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్- బోధన్‌ల మధ్య తిరుగుతున్నాడు. ఇదీ ఈ కేసు. ఈ కేసులో ఎక్కడా షకీల్ కొడుకు తప్పు చేయకున్నా.. పోలీసులు తప్పుడు కేసులు.. టార్చర్ లాంటి ఉదంతాలకు తావే లేదు. తప్పంతా కొడుకుదే. మరి ఈ కేసు విషయాన్ని బీఆరెస్.. ఇప్పుడు బయటకు తీయడం ఏదో చెబుదామనుకుంటే.. మరేదో అయినట్టు బూమరాంగ్ అయి కూర్చుంది.
మరి షకీల్‌పై పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ప్రవీణ్ సాబ్! ఒక్కవేలు ఇటు చూపే క్రమంలో వారికి తెలియకుండానే వారి దోషాలను ఇలా బయటపెట్టుకుని నాలుక్కర్చుకుంటున్నారు. ఇక పోస్టర్లు వేయడం.. మెట్రో ట్రైన్‌లో ఫోటో చూపుతూ పారిపోయాడు.. తెలిస్తే పోలీలకు చెప్పండని బీఆరెస్ చేస్తున్న డ్రామా వెగటు పుట్టించి, డోకు తెప్పించేలానే ఉన్నాయి. ఇక జనాల గోసేదో పట్టించుకోరాదే… రామన్న! నిన్ననే మీ నాయ్న ఏడు గంటలు కూసోబెట్టి పార్టీ నిర్మాణం, సంస్థాగతం… సభ్యత్వం.. అని చెప్పె కదా! నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఫెయిల్ అని ఆయనకు తెలుసు. అందుకే నీకోసమే ఏడు గంటలు క్లాసు తీసుకున్నట్టున్నాడు.. అని బీఆరెస్ పార్టీ నేతలే అనుకుంటున్నారు.