E-Paper
Advertisement

హోండా ZR-V టీజర్ విడుదల.. స్పోర్టీ డిజైన్‌, కళ్లు చెదిరే ఫీచర్లు!

హోండా ZR-V టీజర్ విడుదల.. స్పోర్టీ డిజైన్‌, కళ్లు చెదిరే ఫీచర్లు!
Advertisement

Honda Reveals First Teaser of ZR-V Hybrid SUV: హోండా కార్స్ ఇండియా కొత్త హైబ్రిడ్ SUV  హోండా ZR-Vను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ SUVని మే 22న అధికారికంగా రిలీజ్ చేయనుంది. విడుదలకు ముందు  టీజర్ ను విడుదల చేసింది.  ఇందులో SUV ముందు భాగం డిజైన్ కనిపించింది. కొత్త LED హెడ్‌ ల్యాంప్స్, మధ్యలో హోండా లోగో, స్టైలిష్ DRLs, ఎత్తైన బోనెట్‌ తో ప్రీమియం లుక్‌ ను కలిగి ఉంది. కారు లవర్స్ ను ఈ మోడల్ క్రేజీగా ఆకట్టుకుంటుంది.

CBU రూపంలో హోండా ZR-V భారత ఎంట్రీ

భారత్ కు రానున్న హోండా ZR-V గ్లోబల్ మోడల్ డిజైన్‌ ను ఎక్కువగా కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ SUVను పూర్తిగా తయారైన యూనిట్ (CBU) రూపంలో భారత్‌ కు తీసుకురానున్నారు. ముందు భాగంలో పెద్ద గ్రిల్, మెష్ ప్యాటర్న్ డిజైన్, స్లిమ్ LED హెడ్‌ లైట్లు SUVకి స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. బంపర్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.  సైడ్ ప్రొఫైల్‌ను చూస్తే కూపే స్టైల్ రూఫ్‌ లైన్ కనిపిస్తుంది. పెద్ద 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్ప్ బాడీ లైన్స్ SUVకి ప్రీమియం ఫీలింగ్ ఇస్తున్నాయి. వెనుక భాగంలో పెద్ద LED టెయిల్‌ ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫినిషర్లు రానున్నాయి. ZR-V యువతతో పాటు కుటుంబ వినియోగదారులను ఆకట్టుకునేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

హోండా ZR-V ఇంటీరియర్ గురించి..

Advertisement

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ SUVలో హోండా సివిక్ కారును గుర్తు చేసే డాష్‌ బోర్డ్ డిజైన్ ఉండొచ్చని తెలుస్తోంది.  హనీకోంబ్ స్టైల్ AC వెంట్స్, ఫ్రీ స్టాండింగ్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. క్యాబిన్‌ లో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉపయోగించడం వల్ల ప్రీమియం ఫీలింగ్ కలగనుంది.

అత్యాధునిక ఫీచర్లు

ఫీచర్ల పరంగా కూడా హోండా ZR-V చాలా అడ్వాన్స్‌ గా ఉండబోతోంది. వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. భద్రత కోసం ADAS టెక్నాలజీ, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్స్  లాంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

పవర్‌ ట్రెయిన్ గురించి..

Advertisement

భారత మార్కెట్లో ఈ SUV 2.0 లీటర్ 4 సిలిండర్ అట్కిన్సన్ పెట్రోల్ ఇంజిన్‌ తో వచ్చే అవకాశం ఉంది. దీనికి హోండా e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ యాడ్ చేయనున్నారు. ఈ సెటప్ సుమారు 180 bhp పవర్, 315 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. eCVT గేర్‌ బాక్స్‌ తో ఈ పవర్‌ ట్రెయిన్ పని చేయనుంది.

అదిరిపోయే మైలేజ్

మైలేజ్ పరంగా కూడా ఈ SUV మంచి ఫలితాలు ఇవ్వొచ్చని అంచనా. ప్రపంచ మార్కెట్లలో ఈ హైబ్రిడ్ సిస్టమ్ 100 కిలో మీటర్లకు సుమారు 5.7 నుంచి 5.8 లీటర్ల ఫ్యూయెల్ వినియోగిస్తుందని చెబుతున్నారు. భారత లెక్కల ప్రకారం దాదాపు 17 నుంచి 18 kmpl వరకు మైలేజ్ రావచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ZR-V..  0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 8 సెకన్లలో అందుకుంటుందని తెలుస్తోంది. ప్రీమియం హైబ్రిడ్ SUV సెగ్మెంట్‌లో హోండా ZR-V టయోటా, హ్యుందాయ్, జీప్ లాంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

Read Also: హైబ్రిడ్ కార్ల అమ్మకాల్లో టయోటా జోష్.. ఏకంగా 3 లక్షల మార్క్ క్రాస్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×