E-Paper
Advertisement

Manual Car to Automatic Car: మాన్యువల్ కారును ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు.. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?

Manual Car to Automatic Car: మాన్యువల్ కారును ఆటోమేటిక్‌గా మార్చుకోవచ్చు.. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?
Advertisement

ట్రాఫిక్ లో క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడంతో విసిగిపోయిన చాలా మంది కార్ల యజమానులు, తమ మాన్యువల్ కార్లను ఆటోమేటిక్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాంకేతికంగా సాధ్యమే అయినప్పటికీ, ఈ ప్రక్రియలో మేజర్ మెకానికల్ ఛేంజెస్ అనేవి ఉంటాయి. కాస్త ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుందని ఆటో నిపుణులు చెప్తున్నారు.

మాన్యువల్ కారును ఆటోమేటిక్ గా ఎలా మార్చుతారంటే?

మాన్యువల్ కారును ఆటోమేటిక్‌గా మార్చడం అంటే స్విచ్ మార్చడం,  గేర్‌ ను తీసివేయడం మాత్రమే కాదు. ఈ కన్వర్షన్ లో సాధారణంగా క్లచ్ సిస్టమ్, ట్రాన్స్‌ మిషన్, ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ తో సహా అనేక కీలక భాగాలను మార్చాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఉన్నవాటినే సవరించాల్సి ఉంటుంది. మెకానిక్‌లు కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ కిట్ లేదంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ సిస్టమ్‌ ను ఇన్‌ స్టాల్ చేస్తారు. ఇది మాన్యువల్ గేర్ షిఫ్టింగ్‌ కలిగి ఉంటూనే క్లచ్‌ ను ఆటోమేట్ చేస్తుంది. ట్రాన్స్‌ మిషన్ మార్పులతో పాటు, వెహికల్ వైరింగ్, ఇంజిన్ కంట్రోల్ యూనిట్, గేర్ లింకేజీకి మార్పులు కూడా అవసరం అవుతాయి. ఫిజికల్ గా మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ గా మార్చిన తర్వాత  కారును RTO తనిఖీ చేసి ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త మార్పులను సూచిస్తూ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)ను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.

ఖర్చు ఎంత అవుతుందంటే?  

Advertisement

ఇక మాన్యువల్ కారును ఆటోమేటిక్‌గా మార్చడానికి అయ్యే ఖర్చు సిస్టమ్ టైప్, కారు మోడల్, లేబర్ ఛార్జీలను బట్టి మారుతూ ఉంటుంది. చిన్న, మిడ్ రేంజ్ కార్లకు అనువైన బేసిక్ ఆటోమేటిక్ కిట్లు సాధారణంగా రూ. 70,000 నుంచి రూ. 1.3 లక్షల వరకు ఉంటాయి. పెద్ద, ప్రీమియం కార్లలో ఉపయోగించే పూర్తి ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ లతో సహా మరింత అధునాతన వ్యవస్థలు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలు కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. ఈ ఖర్చులలో కన్వర్షన్ కిట్, ఇన్‌స్టాలేషన్ లేబర్, ECU రీమ్యాపింగ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి.

కన్వర్షన్ తో ప్రయోజనాలు ఏంటి?

ఆటోమేటిక్ కన్వర్ష న్‌ను ఎంచుకునే డ్రైవర్లు తరచుగా నగర ట్రాఫిక్‌ లో సౌకర్యంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ తగ్గుతుంది. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ సిస్టమ్ క్లచ్‌ను ఆపరేట్ చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా రద్దీలో  రోజువారీ డ్రైవింగ్‌ను మరింత ఈజీగా మార్చుతుంది.

చట్టపరమైన నిబంధనలు   

Advertisement

మాన్యువల్ కారును ఆటోమేటిక్‌గా మార్చడం ప్రత్యేక వర్క్‌ షాప్‌ల ద్వారా సాధ్యమవుతుంది. అయితే, ముందుగానే  ప్రణాళిక, బడ్జెట్ ను చూసుకోవాలి. మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ గా మారే సమయంలో చట్టపరమైన నిబంధనలకు లోబడి మార్పులు ఉండాలి. ఆ నిబంధనలు ఏంటనేవి ముందే, ఆర్టీఓ అధికారులను సంప్రదించి అందుకు అనుగుణమైన మార్పులు చేయాల్సి ఉంటుంది. కన్వర్షన్ తర్వాత వాహనం భద్రత, రెడ్ వర్తీనెస్ కోసం టెస్ట్ చేయాలి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు మార్పుల గురించి సమాచారం ఇవ్వాలి. కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ను అప్ డేట్ చేయించుకోవాలి.

Read Also:  సరికొత్తగా 1940 నాటి బైక్.. మతి పోగొట్టేస్తున్న2026 ఇండియన్ చీఫ్ వింటేజ్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×