Indian Chief Vintage Bike 2026: ఇండియన్ మోటార్ సైకిల్ కంపెనీ చీఫ్ వింటేజ్.. తన 125వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అదిరిపోయే వింటేజ్ బైక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తన సరికొత్త వేరియంట్ అయిన చీఫ్ వింటేజ్ 2026 ను లాంచ్ చేసింది. సెకెండ్ వరల్డ్ వార్ నాటి ఇండియన్ చీఫ్ మోడల్‌ను గుర్తుకు తెచ్చే డిజైన్ తో దీనిని మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
2026 ఇండియన్ చీఫ్ వింటేజ్ 1940 నాటి లుక్ తో అత్యాధునిక హంగులను జోడించి అందుబాటులోకి తీసుకురాబోతోంది. దానికి క్లాసిక్ డిజైన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింత అందంగా రూపొందించింది. ఇందులో వెడల్పాటి హ్యాండిల్ బార్ లు, లెదర్ సాడిల్ బ్యాగులు, విటేజ్ స్టైల్ వైట్ వాల్ టైర్లు ఉన్నాయి. టియర్ డ్రాప్ లుక్ ట్యాంక్ అచ్చం రెట్రోగా కనిపిస్తుంది. నలుపు రంగులో ఉన్న ఇండియన్ లోగో రెడ్ కలర్ స్కీమ్ తో బాగా సెట్ అయ్యింది. చివరగా, పెద్ద వెనుక ఫెండర్ తో బాగా సరిపోయే ఫ్రీ ఫ్లోటింగ్ సీటు కూడా ఉంది. కొత్త వేరియంట్ అద్భుతమైన స్టైలింగ్ లో వస్తుంది. ఫస్ట్ లుక్ లో 1940 నాటి ఒరిజినల్ తో పోల్చి చూస్తే, తేడాలను కనిపెట్టడం అంత ఈజీ కాదు.
2026 ఇండియన్ చీఫ్ వింటేజ్ ఇంజిన్ ను పరిశీలిస్తే, పవర్ ఫుల్ థండర్ స్ట్రోక్ 116 V ట్విన్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన టార్క్, క్లాసిక్ క్రూయిజర్ అనుభూతిని అందిస్తుంది. ఈ థండర్‌స్ట్రోక్ 116CI ఇంజిన్ 1,890cc సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎయిర్ కూల్డ్, V-ట్విన్ మోటార్తో వస్తుంది. ఇది 3,300rpm, 156Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ బైక్ పాతకాలం లుక్ ను కలిగి ఉన్నప్పటికీ, ఇందులో కీలెస్ ఇగ్నిషన్, క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్స్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ బెలూన్ టైర్లతో 16 అంగుళాల క్రాస్ స్పోక్ వీల్స్ ను కలిగి ఉంటుంది. రెట్రో లుక్ కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఇండియన్ చీఫ్ వింటేజ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, స్పోర్ట్, టూర్, స్టాండర్డ్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌తో 4-అంగుళాల రౌండ్ TFT కన్సోల్ ను కలిగి ఉంటుంది.
Read Also: ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ లో సుజుకి బర్గ్ మాన్ స్ట్రీట్, ధర ఎంతో తెలుసా?
ఈ బైక్ ఇండియన్ మోటార్ సైకిల్ తన చీఫ్ లైనప్ లో మరిన్ని రంగుల్లో, కస్టమైజేషన్ ఆప్షన్లతో ఈ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ బైక్ కావాలనుకునే వాళ్లు ఇండియన్ మోటార్ సైకిల్ అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదంటే దగ్గరలోని కంపెనీ ఔట్ లెట్ కు వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.
Read Also: కవాసకి క్రేజీ ఆఫర్.. ఆ బైక్ మీద ఏకంగా 1.43 లక్షల డిస్కౌంట్!