E-Paper
Advertisement

ఎండలో కారు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!

ఎండలో కారు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!
Advertisement

Car Maintenance Tips for Summer: వేసవి కాలంలో తీవ్రమైన వేడి మనుషులకే కాకుండా కార్లపైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.  మన దేశంలో  ఎండా కాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎండలో గంటల పాటు పార్క్ చేసిన కార్లు మరింత వేడెక్కుతాయి. అయితే, కొన్ని చిన్న టిప్స్ పాటించడం వల్ల కారును డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ పార్కింగ్ విషయంలో జాగ్రత

ముందుగా పార్కింగ్ విషయంలో జాగ్రత్త అవసరం. బయటకు వెళ్లినప్పుడు సాధ్యమైనంత వరకు నీడలో కారును పార్క్ చేయడానికి ప్రయత్నించాలి. చెట్టు కిందైనా పార్క్ చేయడం మంచిది. నీడ దొరకకపోతే కార్ కవర్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల కారు పెయింట్‌ ను కాపాడటమే కాకుండా, లోపల ఉష్ణోగ్రతను కొంత వరకు తగ్గుతుంది.

⦿ కాసేపు డోర్లు ఓపెన్ చేయండి!

Advertisement

ఎండలో ఉంచిన కారులోకి తిరిగి వచ్చినప్పుడు వెంటనే డ్రైవ్ చేయకుండా కొద్దిసేపు డోర్లు ఓపెన్ చేయాలి. లోపలి వేడి బయటకు వెళ్లేలా చేయాలి. ఆ తర్వాత ఏసీ ఆన్ చేయాలి. వెంటనే ఫుల్ స్పీడ్‌ లో కాకుండా, నెమ్మదిగా చల్లబడేలా ఉంచితే ఏసీపై ఒత్తిడి తగ్గుతుంది.

⦿ విండ్‌ షీల్డ్ సన్‌ షేడ్ ఉపయోగించండి!

కారు లోపలి భాగాలను కూడా వేడి నుంచి కాపాడుకోవాలి. ఎండ నేరుగా పడే డాష్‌ బోర్డ్, సీట్లు, ప్లాస్టిక్ భాగాలు వేడితో దెబ్బతినే అవకాశం ఉంటుంది. విండ్‌ షీల్డ్ సన్‌ షేడ్ వాడటం వల్ల సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.  లెదర్ సీట్లు ఉన్న కార్లలో సీట్ కవర్లు ఉపయోగించడం వల్ల వేడి తగ్గడంతో పాటు, సీట్ల లైఫ్ కూడా పెరుగుతుంది.

⦿ ఇంజిన్ విషయంలో జాగ్రత్త

Advertisement

ఇంజిన్ భాగాలను నిర్లక్ష్యం చేయకూడదు. వేడిలో ఇంజిన్ కూలెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. కూలెంట్ స్థాయిని రెగ్యలర్ గా చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ కూడా అవసరమైనంత మేరలో ఉండాలి. సర్వీసింగ్ ఆలస్యం చేయకుండా సమయానికి చేయించుకోవడం మంచిది.

⦿ టైర్ల విషయంలో జాగ్రత్త

ఎండాకాలంలో టైర్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి. వేడి కారణంగా టైర్లలో గాలి విస్తరించి ప్రెజర్ పెరుగుతుంది. అందుకే తరచుగా టైర్ ప్రెజర్ చెక్ చేయాలి. పగుళ్లు, అరిగిన టైర్లు ఉంటే వెంటనే మార్చాలి. భద్రత విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవడం మస్ట్.

⦿ ఎండలో ప్రయాణాలు వద్దు!

దూర ప్రయాణాలు ప్లాన్ చేసేటప్పుడు మధ్యాహ్నం వెళ్లకపోవడం మంచిది. ఉదయం లేదంటే సాయంత్రం ప్రయాణించడం మంచిది. డ్రైవింగ్ సమయంలో టెంపరేచర్ గేజ్‌ ను గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా పెరిగితే వెంటనే కారు ఆపి చల్లారనివ్వాలి. మొత్తంగా వేసవిలో కారును సమస్య రాకుండా కాపాడుకునేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

Read Also: టాటా పంచ్ EVకి పోటీగా BYD అట్టో 1.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×