E-Paper
Advertisement

రామ్ చరణ్ డ్యాన్స్ విధ్వంసానికి రంగం సిద్ధం.. ఏప్రిల్ 9 నుండి స్పెషల్ సాంగ్..

రామ్ చరణ్ డ్యాన్స్ విధ్వంసానికి రంగం సిద్ధం.. ఏప్రిల్ 9 నుండి స్పెషల్ సాంగ్..
Advertisement

Peddi Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. భారీ బడ్జెట్‌తో, పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఒక హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఏప్రిల్ 9వ తేదీ నుండి ప్రారంభం కానుంది. దానికి డైనమిక్ డాన్స్ మాస్టర్ కొరియేగ్రఫీ వహిస్తున్నారు.

Read also-‘వేగ లీల’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. సినిమా గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?

జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో

Advertisement

రామ్ చరణ్ డ్యాన్స్ అంటే కేవలం స్టెప్పులు మాత్రమే కాదు, అది ఒక ఎనర్జీ. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మూమెంట్స్ డిజైన్ చేయడంలో జానీ మాస్టర్ దిట్ట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ‘పెద్ది’ కోసం జానీ మాస్టర్ మరోసారి తన మార్కు మాస్ కొరియోగ్రఫీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం మైసూర్‌లో ఒక భారీ సెట్‌ను నిర్మించారని, దాదాపు వందల సంఖ్యలో డ్యాన్సర్లతో ఈ సాంగ్ షూట్ చేయబోతున్నారని సమాచారం.

రెహమాన్ మ్యాజిక్

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. బుచ్చిబాబు అభిరుచికి తగ్గట్టుగా రెహమాన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని, ముఖ్యంగా ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యంత కష్టతరమైన మరియు వేగవంతమైన స్టెప్పులను ఈ పాటలో వేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చాట్ బాస్టర్లుగా నిలిచాయి. ఇది ఐటమ్ నెంబర్ కావడంతో ఫ్యాన్స్ ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Read also-LIK పై అనిల్ రావిపూడి ఫస్ట్ రివ్యూ.. ప్రదీప్ ఖాతాలో మరో హిట్ గ్యారెంటీ?

భారీ విజువల్స్

ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ ఒక విలేజ్ క్రీడాకారుడిగా కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన మేకోవర్ ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరిచింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 9 నుండి జరిగే ఈ షెడ్యూల్ పూర్తయితే, సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×