E-Paper
Advertisement

Hybrid Vs Plug-In Hybrid: హైబ్రిడ్ vs ప్లగ్ ఇన్ హైబ్రిడ్.. వీటిలో ఏ కార్లు బెస్ట్?

Hybrid Vs Plug-In Hybrid: హైబ్రిడ్ vs ప్లగ్ ఇన్ హైబ్రిడ్.. వీటిలో ఏ కార్లు బెస్ట్?

గత కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆటో మోబైల్ కంపెనీలు సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తక్కువ విద్యుత్ ఉపయోగించుకుని ఎక్కువ రేంజ్ అందించే కార్లను రూపొందిస్తున్నాయి. అయితే, తరచుగా ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడుకునే సమయంలో హైబ్రిడ్(Hybrid), ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (Plug-in Hybrid లేదా PHEV) అని వింటూ ఉంటాం. ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వినియోగదారులు ఏ కారు కొనుగోలు చేస్తే బెస్ట్? అనే విషయా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హైబ్రిడ్ , ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మధ్య తేడాలు  

⦿ బ్యాటరీ సైజు: రెగ్యులర్ హైబ్రిడ్ లో బ్యాటరీ సైజు చాలా చిన్నగా ఉంటుంది. 1-2 kWh పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలో బ్యాటరీ సైజ్ చాలా పెద్దిగా ఉంటుంది. దీని పరిమాణం 8–25 kWh ఉంటుంది.

⦿ ఎలక్ట్రిక్ ఓన్లీ రేంజ్: రెగ్యులర్ హైబ్రిడ్ లో చాలా తక్కువగా అంటే 1–5 కి.మీ మాత్రమే ఉంటుంది.  ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలో 40–120 కి.మీ వరకు ఉంటుంది. కొన్ని మోడళ్లలో 150 కి.మీ కూడా ఉంటుంది.

⦿ బయట నుంచి ఛార్జ్ చేయడం: రెగ్యులర్ హైబ్రిడ్ లో సాధ్యం కాదు. పెట్రోల్ ఇంజన్ & రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా మాత్రమే ఛార్జ్ అవుతుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలో ఇంట్లో 7 kW వాల్ బాక్స్ లేదంటే పబ్లిక్ ఛార్జర్‌ తో ఛార్జ్ చేయవచ్చు.

⦿ రోజువారీ యూస్‌ లో మైలేజ్: రెగ్యులర్ హైబ్రిడ్ లో సగటున 20–28 kmpl (పెట్రోల్ + ఎలక్ట్రిక్ కలిపి) వస్తుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలో  రోజూ ఛార్జ్ చేస్తే 50–150 kmpl కూడా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ దూరం ఎలక్ట్రిక్‌లోనే వెళ్తుంది.

⦿ ధర ఎంత ఉంటుందంటే?: రెగ్యులర్ హైబ్రిడ్ కారు చౌకగా ఉంటుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలో  పోల్చితే రూ.5–15 లక్షలు చౌకగా ఉంటుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలో పెద్ద బ్యాటరీ ఉంటుంది కాబట్టి ధర ఎక్కువగా ఉంటుంది.

హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లకు ఎగ్జాంపుల్స్ 

రెగ్యులర్ హైబ్రిడ్:  Toyota Hyryder Hybrid, Maruti Grand Vitara Hybrid, Honda City e:HEV

ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు: BYD Seal 06 DM-I, MG QS (చైనా), Jeep Wrangler 4xe (గ్లోబల్)

సింపుల్‌గా చెప్పాలంటే..

⦿ హైబ్రిడ్:  సెల్ఫ్ ఛార్జింగ్ అవుతుంది. పెట్రోల్ పోస్తే చాలు, ఎక్కువ మైలేజ్ వస్తుంది. పూర్తి ఎలక్ట్రిక్ ఎక్స్ పీరియెన్స్ ఉండదు.

⦿ ప్లగ్ ఇన్ హైబ్రిడ్:  కచ్చితంగా ఛార్జ్ చేయాలి.  పెట్రోల్ అవసరం లేదు. కానీ ధర ఎక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం ఉండాలి.

ఏ కారు బెస్ట్ అంటే?

రోజువారీ డ్రైవింగ్ 60 కి.మీ లోపు ఉంటే, ఇంట్లో ఛార్జర్ పెట్టుకోగలిగితే  ప్లగ్ ఇన్ హైబ్రిడ్  చాలా మంచిది. అలాకాకుండా ఎక్కువ ప్రయాణం, ఛార్జింగ్ ఇబ్బంది ఉంటే సాధారణ హైబ్రిడ్ బెటర్. అయితే, గత కొద్ది కాలంగా ఎక్కువ రేంజ్ ను అందించే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి.

Read Also:  2026లో విడుదల కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవి, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటంటే?

Related News

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

Big Stories

×