Hyundai Bayon Launched: హ్యుందాయ్ మోటార్ నుంచి బేయాన్ SUV మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ఈ కారు ధరను కంపెనీ రూ.10 లక్షలుగా నిర్ణయించింది. డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించింది. హ్యుందాయ్ క్రెటా కంటే దిగువన స్థానంలో ఉండే ఈ SUVలో అత్యాధునిక ఫీచర్లు, పెట్రోల్ ఇంజన్, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో CNG వేరియంట్ కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.
హ్యుందాయ్ బేయాన్ కంపెనీ కొత్త ఆర్ట్ ఆఫ్ స్టీల్ డిజైన్ స్టైల్ ను కలిగి ఉంది. ముందు భాగంలో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, L-ఆకారపు డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లాక్ క్లాడింగ్, వెనుక LED టెయిల్ ల్యాంప్స్ వెహికల్ కు స్పెషల్ లుక్ ను ఇస్తున్నాయి. ఈ SUV పొడవు 4,245 మి.మీ., వెడల్పు 1,810 మి.మీ., ఎత్తు 1,605 మి.మీ.గా ఉంది. దీని వీల్‌బేస్ 2,600 మి.మీ. కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 205 మి.మీ. బూట్ స్పేస్ 505 లీటర్లు.
బేయాన్ లోపల రెండు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు ఆకట్టుకుంటున్నాయి. ఒకటి డ్రైవర్‌కు సంబంధించిన సమాచారం కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగపడుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ముందు వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, బోస్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. జనరేటివ్ AI వాయిస్ అసిస్టెంట్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్ కూడా ఉంటుంది.
భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్ ఈ ఏడాది చివరి నాటికి రావచ్చని తెలుస్తోంది.
హ్యుందాయ్ బేయాన్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 115hp పవర్, 144Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. CVT వేరియంట్ కు ARAI ప్రకారం లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజీ ఉన్నట్లు తెలుస్తోంది.
బేయాన్ CNG వేరియంట్‌ను 2027 జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే, తక్కువ ఇంధన ఖర్చుతో SUV కోరుకునే వారికి మరో బెస్ట్ ఆప్షన్ లభించనుంది. మారుతి విక్టోరిస్, గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, టాటా సియెర్రా లాంటి మోడళ్లు ఈ SUV పోటీ పడే అవకాశం ఉంది.
Read Also: రూ.10 లక్షల లోపు కొత్త కార్లు.. త్వరలో రానున్న టాప్ మోడళ్లు ఇవే!