E-Paper
Advertisement

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!
Advertisement

Skoda Car Offers October 2026: పండుగల సమయంలో కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి స్కోడా ఆటో ఇండియా క్రేజీ ఆఫర్లను అందిస్తోంది. అక్టోబర్ 2026కు సంబంధించి పలు మోడళ్లపై డీలర్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు, లాయల్టీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్కోడా కైలాక్‌ పై రూ.90,000, కుషాక్‌పై రూ.80,000 వరకు తగ్గింపులు లభిస్తున్నాయి. ఇటీవల విడుదలైన స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ పైనా ఆఫర్లు ప్రకటించారు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీల్స్ అక్టోబర్ 31, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

స్కోడా కైలాక్‌పై రూ.90,000 తగ్గింపు

స్కోడా కార్లలో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కైలాక్‌పై ఈ నెలలో అత్యధికంగా రూ.90,000 వరకు బెనిఫిట్స్ పొందుతోంది. ఇందులో రూ.40,000 వరకు డీలర్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 వరకు కార్పొరేట్, లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. కైలాక్‌ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఇదే ఇంజన్‌ను స్కోడా కుషాక్, స్లావియా మోడళ్లలోనూ ఉపయోగిస్తున్నారు. కైలాక్ ధరలు రూ.7.59 లక్షల నుంచి రూ.13.09 లక్షల వరకు ఉన్నాయి. ఈ SUV మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్, కియా సోనెట్ లాంటి మోడళ్లకు పోటీగా నిలుస్తోంది.

స్కోడా కుషాక్‌పై రూ.80,000 ఆఫర్లు

Advertisement

మిడ్‌ సైజ్ SUV కొనాలనుకునే వారికి స్కోడా కుషాక్‌పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. అక్టోబర్‌లో ఈ కారుపై రూ.80,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.30,000 వరకు డీలర్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 వరకు కార్పొరేట్, లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. కుషాక్ 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. దీని ధర రూ.10.69 లక్షల నుంచి రూ.19.19 లక్షల వరకు ఉంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్‌ వ్యాగన్ టైగన్, రెనాల్ట్ డస్టర్, మారుతి విక్టోరిస్ లాంటి SUVలకు ఇది పోటీ ఇస్తోంది.

స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ పైనా ఆఫర్లు

ఇటీవల విడుదలైన స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌పై రూ.30,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు కార్పొరేట్, లాయల్టీ ప్రయోజనాలు ఉన్నాయి. కుషాక్‌ లో ఉన్న తరహాలోనే 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికలు స్లావియాలోనూ లభిస్తాయి. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.18.84 లక్షల వరకు ఉంది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌ వ్యాగన్ వర్టస్‌ కు ఇది ఆల్టర్నేటివ్ గా  నిలుస్తోంది.

కొనుగోలుదారులు ఏం చేయాలంటే..

Advertisement

స్కోడా తాజా ఆఫర్లు ప్రతి కస్టమర్‌ కు వర్తిస్తాయని చెప్పలేం. కారు కొనుగోలు చేసే ముందు దగ్గరలోని స్కోడా డీలర్‌ ను కలిసి, ఎక్స్ఛేంజ్ నిబంధనలు, అర్హతలు, ఆన్‌రోడ్ ధరను తెలుసుకోవడం మంచిది.

Read Also: ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Tags

Related News

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×