E-Paper
Advertisement

Hyundai Creta Electric: హ్యుండాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు.. దీనికి బ్రేకులు ఉండవు తెలుసా?

Hyundai Creta Electric: హ్యుండాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు.. దీనికి బ్రేకులు ఉండవు తెలుసా?
Advertisement

Hyundai Creta Electric i-Pedal: కారును ఆపాలంటే బ్రేకులు వేయాలి. అసలు బ్రేకులే లేకుంటే? బ్రేకులు లేకుండా కారు ఎలా ఉంటుంది? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, మీరు విన్నది నిజం. హ్యుండాయ్ నుంచి వచ్చిన క్రెటా ఎలక్ట్రిక్ కారులో ఐ-పెడెల్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీతో బ్రేకులు లేకుండానే కారును నడిపే అవకాశం ఉంటుంది.

ఇంతకీ ఏంటీ ఐ-పెడల్ టెక్నాలజీ?

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు.. పెట్రోల్, డీజిల్ కార్లలో ఉపయోగించే బ్యాటరీలకు పవర్‌ ట్రెయిన్‌ లో చాలా మార్పులు ఉంటాయి. అంతేకాదు, పలు డ్రైవింగ్ టెక్నాలజీలను తీసుకొస్తుంది. హ్యుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ లోనూ ఐ-పెడల్ టెక్నాలజీ ఫ్యూచరిస్టిక్ డ్రైవింగ్ ను చూపిస్తుంది.

Advertisement

ఐ-పెడల్ ను సాధారణంగా వన్ పెడల్ డ్రైవింగ్ అని కూడా పిలుస్తారు. ఈ సెట్టింగ్‌లో రీజెనరేటివ్ బ్రేకింగ్ విధానం చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. యాక్సిలరేటర్ నుంచి కుడి కాలును తీసిన వెంటనే, కారు వేగం చాలా త్వరగా తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే, దాదాపుగా సాంప్రదాయ బ్రేకింగ్ విధానం లాగే ఉంటుంది. ఏట వాలుగా ఉన్న ప్రదేశాల్లోనూ యాక్సిలరేటర్ నుంచి కారును తీయగానే పూర్తిగా ఆగిపోతుంది. స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌ లో.. బ్రేక్ పెడల్‌ ను అస్సలు ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు.

ఢిల్లీలో బ్రేకులు వేయకుండా ప్రయాణం

రీసెంట్ గా కొంత మంది ఆటో విశ్లేషకులు ఈ కారును ఢిల్లీలో బ్రేకులు లేకుండా నడిపే ప్రయత్నం చేశారు. క్రెటా ఎలక్ట్రిక్‌ ను సుమారు 185 కి.మీ నడిపారు. ఎక్కడా కారు బ్రేక్ పెడల్ మీద కారు పెట్టకపోవడం విశేషం. ఈ కారుకు సంబంధించిన  10.5 కి.మీ/kWh బ్యాటరీ బాగా పని చేస్తుందన్నారు. ఒక యూనిట్ పవర్ తో  క్రెటా ఎలక్ట్రిక్ 10.5 కి.మీ ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అంటే కి.మీ.కు రూ. 1 కంటే తక్కువ ప్రయాణ ఖర్చు అవుతుంది.

ఐ-పెడల్ యాక్టివేషన్ ఎలా?   

Advertisement

క్రెటా ఎలక్ట్రిక్‌ లో ఎడమ వైపు ప్యాడిల్ షిఫ్టర్ సింపుల్ గా లాగడం ద్వారా ఐ-పెడల్ యాక్టివేట్ అవుతుంది. కారును రివర్స్ చేసినప్పుడు, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఇది ఆటో మేటిక్ గా డిస్‌ ఎన్‌గేజ్ అవుతుంది. అయితే, దీనిని డ్రైవ్ చేసే ప్రతిసారీ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.

ఐ-పెడల్ అనేది కొత్త టెక్నాలజీనా?

వాస్తవానికి ఈ టెక్నాలజీ కొత్తదేమీ కాదు. రిజెనరేటివ్ బ్రేకింగ్ దశాబ్ద కాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 2017లో నిస్సాన్ ఇన్ ది లీఫ్‌ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ కారులలో దీనిని ఇ-పెడల్ అని పిలుస్తారు. టెస్లా కార్లలో దీనిని హోల్డ్ అని పిలుస్తారు. టెస్లా 2019లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ మార్కెట్ లో ఈ టెక్నాలజీ హ్యుండాయ్ అయోనిక్ 5, కియా EV6, వోల్వో XC40 రీఛార్జ్, C40 రీఛార్జ్‌ లలో కనిపిస్తుంది. BMW EVలలో B మోడ్‌ను కలిగి ఉంది. ఈ విధానాన్ని స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో దీనిని ఉపయోగించడం మంచిది. ఎందుకంటే, యాక్సిలరేటర్ నుంచి  కాలు తీసే ప్రతిసారీ, ఐ-పెడల్ బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది.

Read Also: బెంట్లీ GT S Vs GTC S.. ఈ లగ్జరీ కార్లలో ఏది బెస్ట్ అంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×